Rakasa: ‘రాకాస’.. ఆ వీరుడు ఎవరో తెలుసా..
ABN , Publish Date - Jan 23 , 2026 | 06:50 PM
‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో జాతీయ స్థాయిలో నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు నిహారిక కొణిదెల. ఇప్పుడు జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక నిర్మిస్తోన్న చిత్రం ‘రాకాస’.
‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో జాతీయ స్థాయిలో నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు నిహారిక కొణిదెల(Niharika konidela) ఇప్పుడు జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక నిర్మిస్తోన్నచిత్రం ‘రాకాస’(Rakasa). సంగీత్ శోభన్ (Sangeetho Sobhan)మొదటి సారి సోలో హీరోగా తెరపైకి రాబోతోన్నారు. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 3న విడుదల చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టైటిల్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘రాకాస’ గ్లింప్స్ విడుదల చేశారు.
‘యుగయుగాలుగా ప్రతీ కథలో ఒక సమస్య.. ఆ సమస్యను ఛేదించడానికి ఓ వీరుడు పుడతాడు.. ఆ వీరుడు ఎవరో అని తెలిసేలోపే నిశ్శబ్దంగా పని ముగిస్తాడు.. ఈ కథలో ఆ వీరుడు నేనే’ అంటూ ఓ రేంజ్ లెవెల్ ఎలివేషన్ ఇస్తూ గ్లింప్స్ వదిలారు. ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగా కొత్త కథతోనే మరో ప్రయోగం చేస్తున్నట్టుగా ఈ గ్లింప్స్ చెబుతోంది. అనుదీప్ దేవ్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.