మెగా డాటర్.. ఈసారి పెద్దగానే ప్లాన్ చేసిందిగా

ABN , Publish Date - Oct 28 , 2026 | 09:52 PM

మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) వైవిధ్యభరితమైన ప్రాజెక్ట్‌లతో ప్రొడ్యూసర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న విషయం తెల్సిందే.

Niharika Konidela

మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) వైవిధ్యభరితమైన ప్రాజెక్ట్‌లతో ప్రొడ్యూసర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న విషయం తెల్సిందే. ఆమె సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ (Pink Elephant Pictures) బ్యానర్‌పై తెరకెక్కించిన మొదటి చిత్రం కమిటీ కుర్రోళ్లు జాతీయ అవార్డుని గెలుచుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తాజాగా నిహారిక తన బ్యానర్ లో రెండో సినిమాని పట్టాలెక్కించింది. ఇప్పటికే ఈ సినిమాకి పెప్ నెక్స్ట్ అనే వర్కింగ్ టైటిల్ తో అధికారికంగా అనౌన్స్ చేసిన ఈ సినిమాకి భలే గమ్మత్తైన టైటిల్ ని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది.


నిహారిక నిర్మిస్తోన్న ఈ చిత్రానికి పాకెట్ రాకెట్స్ అనే క్యాచీ టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడమే కాకుండా పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. ఇక ఈ చిత్రంలో విలక్షణ నటుడు జె.డి.చక్రవర్తి, మల్టీటెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ శ్రీనివాస్ అవసరాల ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు కే. త్రినాథ్ వర్మ, శ్రియ కొంతం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఎంతో కలర్‌ఫుల్‌గా, డిఫరెంట్ ఎలిమెంట్స్‌తో డిజైన్ చేశారు. ముఖ్యంగా క్యాసినో, గ్యాంబ్లింగ్ ప్రపంచాన్ని తలపించేలా కాయిన్స్, పాచికల డిజైన్లతో పోస్టర్‌ను తీర్చిదిద్దడం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.


ఇక ఈ పోస్టర్‌ ని షేర్ చేస్తూ నిహారిక ఒక మంచి క్యాప్షన్ ని జోడించింది. బొమ్మ బ్లాక్‌బస్టరే, జాక్‌పాటే అంటూ చెప్పుకొచ్చింది. దానికి ముందు పోస్ట్ లో కూడా పెద్దగానే ప్లాన్ చేశాం అంటూ మెగా డాటర్ చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకు జ్ఞాని మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో.. నిహారిక రెండోసారి కూడా గట్టిగా కొడుతుందో లేదో చూడాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Updated Date - Oct 28 , 2026 | 09:58 PM