‘రాకాసా’: ఓవర్సీస్ లో.. భారీగా విడుదల
ABN , Publish Date - Feb 15 , 2026 | 01:46 PM
సంగీత్ శోభన్ (Sangeeth Sobhan), నయన్ సారిక (Nayana Sarika) జంటగా నటిస్తున్న చిత్రం ‘రాకాసా’ (Rakasa). ఓవర్సీస్ లో.. భారీగా విడుదల ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు
సంగీత్ శోభన్ (Sangeeth Sobhan), నయన్ సారిక (Nayana Sarika) జంటగా నటిస్తున్న చిత్రం ‘రాకాసా’ (Rakasa). వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను కీలక పాత్రధారులు. మానస శర్మ రచన, దర్శకత్వం వహించారు. Z స్టూడియోస్ సమర్పిస్తుండగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ‘రాకాస’ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను పొందింది. యూఎస్ఎ, యూరప్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియాలో 350కి పైగా థియేటర్లలో విడుదల కానుంది.
ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్‌కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘రాకాస’ టైటిల్ ప్రకటన, గ్లింప్స్ వదిలిన తర్వాత బజ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1.8 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఇదొక విజువల్ వండర్‌గా సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉండనుంది. కెమెరామెన్ అందించిన విజువల్స్, బీజీఎం సినిమాకు హైలైట్ అని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.