రిలీజ్‌కు రెడీ అవుతున్న 'సందిగ్ధం'
ABN , Publish Date - Mar 11 , 2026 | 10:53 AM
నిహాల్, ప్రియా జంటగా నటించిన సినిమా 'సందిగ్ధం'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే జనం ముందుకు రాబోతోంది.
డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ‘సందిగ్ధం’ (Sandigdham) టీం రెడీ అవుతోంది. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ మూవీకి పార్థసారధి కొమ్మోజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని తీర్థ క్రియేషన్స్ బ్యానర్ మీద సంధ్య తిరువీధుల నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్, పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక త్వరలోనే వరుస అప్డేట్లతో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయబోతున్నారు.

ప్రస్తుతం ‘సందిగ్ధం’ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందిస్తుండగా, నందన్ కృష్ణ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను జీవ కోచెర్ల, నవీన్ రాజ్ సంకరపు, చిట్టి బాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగి, దుర్గ, శ్రీదేవీ, లక్ష్మణ్ రావు తదితరులు పోషిస్తున్నారు.