Nidhhi Agerwal: ఇది ఏఐ కాదు.. సర్ ప్రైజ్ ఇచ్చిన నిధి
ABN , Publish Date - Jan 04 , 2026 | 06:34 PM
హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal).. గతేడాది హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందేమో అని ఆశపడింది. కానీ, వీరమల్లు ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోయింది
Nidhhi Agerwal: హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal).. గతేడాది హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందేమో అని ఆశపడింది. కానీ, వీరమల్లు ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు నిధి ఆశలన్నీది రాజా సాబ్ (The Raja Saab) మీదనే పెట్టుకుంది. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్నాడు. మొట్ట మొదటిసారి డార్లింగ్ పక్కన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
జనవరి 9 న ది రాజా సాబ్ రిలీజ్ కి సిద్దమవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో హీరోయిన్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. నిజం చెప్పాలంటే నిధికి రాజా సాబ్ కంటే ఎక్కువగా శివాజీ కాంట్రవర్సీతో మంచి పాపులారిటీ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆమెపై అభిమానులు దాడి చేశారు. దానివల్ల నిధి చాలా ఇబ్బందిపడింది. ఈ ఒక్క విషయం వలన ఆమెకు బాగా గుర్తింపు వచ్చింది. ఇక ఆ గుర్తింపును ఎప్పటికప్పుడు ఈచిన్నది పెంచుకుంటూ వస్తుంది.
తాజాగా ది రాజా సాబ్ నుంచి ఒక సర్ ప్రైజ్ ఇస్తున్నాను అని చెప్పి డార్లింగ్ తో దిగిన సెల్ఫీని అభిమానులతో పంచుకుంది. ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిగిన సెల్ఫీలా కనిపిస్తుంది. నిధి పక్కన డార్లింగ్ చాలా క్యూట్ గా కనిపిస్తున్నాడు. అయితే ఇది ఏఐ అనుకొనే ప్రమాదం ఉందని.. ముందే నిధి ఇది ఏఐ కాదు అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి డార్లింగ్ అయినా ఈ చిన్నదానికి హిట్ ఇస్తాడేమో చూడాలి.