Nidhhi Agerwal: హాట్ బ్యూటీకి అదొక్కటే లేదు

ABN , Publish Date - May 01 , 2026 | 05:36 PM

టాలీవుడ్ గ్లామర్ ప్రపంచంలో మెరుపు తీగలా మెరిసిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal). సవ్యసాచి సినిమాతో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో గంటలు కొట్టేసింది.

Nidhhi Agerwal

టాలీవుడ్ గ్లామర్ ప్రపంచంలో మెరుపు తీగలా మెరిసిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal). సవ్యసాచి సినిమాతో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో గంటలు కొట్టేసింది. అయితే వెండితెరపై మెరవడానికి కేవలం అందం మాత్రమే సరిపోదని, అదృష్టం కూడా ఉండాలని నిధి అగర్వాల్ విషయంలో మరోసారి రుజువైంది. టాలీవుడ్ లో ఎంట్రీ అదిరిపోయినా.. సక్సెస్ ట్రాక్ మాత్రం ఆశించిన స్థాయిలో సాగడం లేదు.


అసలు నిధి అగర్వాల్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఇస్మార్ట్ శంకర్. పూరీ జగన్నాథ్ మార్క్ మేకింగ్‌లో రామ్ సరసన నటించిన ఈ భామ, దిమాక్ ఖరాబ్ అంటూ మాస్ ప్రేక్షకులను ఊపేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో, నిధి ఇక టాలీవుడ్‌లో సెటిల్ అయిపోయినట్లే అని అందరూ భావించారు. అలాగే ఈ విజయం తర్వాత వరుస ఆఫర్లు క్యూ కడతాయని ఆశించింది. కానీ కాలం ఆమెతో మరోలా ఆడుకుంది. ఇస్మార్ట్ శంకర్ వచ్చి ఏడేళ్లు గడిచిపోతున్నా, ఇప్పటివరకు మరో చెప్పుకోదగ్గ హిట్ ఆమె ఖాతాలో పడలేదు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపు ఏడు పరాజయాలు ఆమెను పలకరించాయి. ఎంత గ్లామర్ ఒలకబోసినా, ఎంత బాగా నటించినా సరే.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం రిజల్ట్ నిరాశ పరుస్తూనే ఉంది. ఇక ఈమె కెరీర్‌ను నిలబెడతాయని భావించిన రెండు భారీ ప్రాజెక్టులైన హరి హర వీరమల్లు, రాజాసాబ్ కూడా అమ్మడిని కాపాడలేకపోయింది.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న పీరియాడిక్ డ్రామా హరి హర వీరమల్లు పై నిధి ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరోవైపు ప్రభాస్ రాజాసాబ్ లోనూ ఈమెకు మంచి ఛాన్స్ దక్కింది. కానీ ఈ సినిమాలు రకరకాల కారణాలతో ఆలస్యం అవ్వడం, ఫ్లాప్‌ అవ్వడం అన్నీ జరిగిపోయాయి. మరోవైపు కొత్త భామల పోటీ పెరిగిపోవడంతో నిధి డైలమాలో పడిపోయింది. టాలీవుడ్‌లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోవడంతో, ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ తన రూట్ మార్చాలని డిసైడ్ అయినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, నిధి అగర్వాల్ ఇప్పుడు మాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తోంది. అక్కడ కేవలం గ్లామర్‌కే కాకుండా పెర్ఫార్మెన్స్‌కు కూడా పెద్దపీట వేస్తారు. అందుకే రూట్ మార్చి, అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు లేదా మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్లు చేసి తన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ కొందరు పెద్ద డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మలయాళంలో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతోంది. మరి ఈ సారి వేస్తున్న ఎత్తుగడలైనా నిధికి మళ్ళీ పూర్వ వైభవాన్ని తెస్తాయో లేదో చూడాలి.

Updated Date - May 01 , 2026 | 05:39 PM