అద్భుతంగా ‘వారణాసి’.. ప్రియాంక అంకితభావానికి ఆశ్చర్యపోయా

ABN , Publish Date - Feb 11 , 2026 | 11:02 AM

రాజమౌళి ‘వారణాసి’ చిత్రంతో ప్రియాంకా చోప్రా చాలా కాలం తర్వాత భారతీయ సినిమాల్లో తిరిగి నటిస్తున్న సంగతి తెలిసిందే.

nick jonas

మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ (Varanasi) చిత్రంతో ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) చాలా కాలం తర్వాత భారతీయ సినిమాల్లో తిరిగి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె నటిస్తుండడంపై అమెరికన్‌ గాయకుడు, ప్రియాంక భర్త నిక్‌ జోనస్ (Nick Jonas) ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రియాంక ‘వారణాసి’ సినిమా కోసం 14 నెలలుగా కష్టపడుతోంది. ఆమె అంకితభావానికి ఆశ్చర్యపోయా. ‘వారణాసి’ అద్భుతంగా ఉండబోతోంది.

ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. భారత్‌ ప్రయాణించిన తొలిసారే ఆ దేశంలోని సంస్కృతి, సంప్రదాయాలతో ప్రేమలో పడిపోయా. భారతీయ సినిమాలు, సంగీతం అంటే నాకెంతో ఇష్టం. నా కూతురు మాల్టీని హిందూత్వ విలువలతో పెంచుతున్నాం. నాకూ, ప్రియాంకకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం’ అని చెప్పారు. కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ‘వారణాసి’ వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

Updated Date - Feb 11 , 2026 | 11:17 AM