అభిమానులకు 'విరోష్' విందు.. స్వయంగా వడ్డించిన విజయ్-రష్మిక
ABN , Publish Date - Mar 04 , 2026 | 06:16 AM
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి తమ అభిమానులకు కలకాలం గుర్తుండిపోయేలా సర్‌ఫ్రైజ్ ఇచ్చారు.
నవదంపతులు (Virosh) విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) మరోసారి తమ అభిమానులకు సడన్ సర్‌ఫ్రైజ్ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫ్యాన్స్‌కు ప్రత్యేక విందు ఇచ్చారు. వారికి స్వయంగా దగ్గరుండి వివిధ రకాల వంటకాలు, స్వీట్లు వడ్డించారు. ఫ్యాన్స్‌తో హ్యాపీ మూమెంట్‌ను సెలెబ్రేట్ చేసుకున్నారు.
అంతేగాక వారి నడుమ అందరితో పాటు కలిసి భోజనం చేశారు. ఆపై అందరితో కాసేపు ముచ్చటించి వారితో సెల్ఫీలు దిగి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి అక్కడికి వచ్చిన వారందరినీ సంతోషంగా పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇదిలాఉంటే.. ఈ రోజు సాయంత్రం తాజ్ కృష్ణలో వివాహ రిసెప్షన్ జరుగనుండగా టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ ఇతర సినీ పరిశ్రమల నుంచి సెలబ్రిటీలు, తెలుంగాణ ఏపీలకు చెందిన రాజకీయ ప్రముఖులు హజరు కానున్నారు. అయితే.. కేవలం ఆహ్వనం ఉన్న వారికి, ముందే ఇచ్చిన కోడ్ ఉన్న వారికి మాత్రమే రిసెప్షన్‌కు వెళ్లడానికి అనుమతి ఉంది.