ప్ర‌ధానిని క‌లిసిన విజ‌య్‌, ర‌ష్మిక‌.. రిసెప్షన్‌కు ఆహ్వానం

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:42 PM

విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక శుక్ర‌వారం ప్ర‌ధాని మోదీని క‌లిసి త‌మ వివాహ రిసెప్ష‌న్‌కు ఆహ్వానించారు.

Vijay Deverakonda, Rashmika

స్టార్ న‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda), ర‌ష్మిక (Rashmika Mandanna) లు త‌మ చిర‌కాల ప్రేమ‌కు శుభం ప‌లికి గురువారం ఉద‌య్ పూర్ వేదిక‌గా మూడు ముళ్ల‌తో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఈ వేడుక అతి కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలోనే గ్రాండ్‌గా జ‌రిగింది.

ras.jpg

ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ తాజ్ కృష్ణాలో మార్చి 4, బుధ‌వారం నిర్వ‌హించ‌నున్న రిసెప్ష‌న్‌కు హ‌జ‌రు కావాల‌ని కోరుతూ ఈ న‌వ జంట భార‌త ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ (Narendra Modi), హోం మంత్రి అమిత్ షా (Amit Shah)ల‌ను స్వ‌యంగా క‌లిసి ఆహ్వన ప్ర‌తిక‌లు అంద‌జేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

amith sha

Updated Date - Feb 27 , 2026 | 12:46 PM