అనంతపురంలో.. విజయ్‌ దేవరకొండ, రష్మిక సంద‌డి

ABN , Publish Date - Mar 27 , 2026 | 06:14 AM

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika Mandanna) గురువారం సాయంత్రం అనంతపురం (Anantapur) జిల్లా కేంద్రానికి వచ్చారు

Vijay Deverakonda, Rashmika

టాలీవుడ్ మోస్ట్ హ్య‌పెనింగ్ క‌పుల్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika Mandanna) గురువారం సాయంత్రం అనంతపురం (Anantapur) జిల్లా కేంద్రానికి వచ్చారు. కర్నూలు నుంచి వీరు వస్తున్న సమాచారం తెలియడంతో నగర శివారులోని తపోవనం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని స్వాగతం పలికారు.

అక్కడి నుంచి క్లాక్‌ టవర్‌ సర్కిల్‌ మీదుగా హౌసింగ్‌ బోర్డు కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న ఈ కొత్త జంటకు వేద పండితులు స్వాగతం పలికారు. రష్మిక, విజయ్‌ దేవరకొండ దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అయితే ఈ జంట ముచ్చ‌ట‌గా మూడోసారి క‌లిసి న‌టిస్తున్న ర‌ణ‌బాలి (Ranabaali) చిత్రం షూటింగ్ అనంత‌ప‌రం ప‌రిస‌రాల్లో జ‌రుగ‌నుంది.

Updated Date - Mar 27 , 2026 | 06:40 AM