నేను రెడీకి గుమ్మడి కాయ కొట్టేశారు...
ABN , Publish Date - Feb 20 , 2026 | 07:27 PM
హవిష్ హీరోగా త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన 'నేను రెడీ' సినిమా షూటింగ్ పూర్తయ్యింది. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించిన క్లయిమాక్స్ తో షూటింగ్ పూర్తయినట్టు మేకర్స్ తెలిపారు.
యంగ్ హీరో హవిష్ (Havish), డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన (Trinadha Rao Nakkina) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'నేను రెడీ'. ఈ సినిమాను హవిష్ సోదరి నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్యా థాపర్ (Kavya Thapar) ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ గురువారంతో పూర్తయ్యింది.
రామోజీ ఫిల్మ్ సిటీలో క్లయిమాక్స్ చిత్రీకరణతో సినిమా పూర్తయ్యిందని, గుమ్మడికాయ కొట్టేసి, కేక్ కట్ చేశామని మేకర్స్ తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందని, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. హవిష్ కెరీర్‌లో తొలి ఎంటర్ టైన్ మెంట్ మూవీ ఇదేనని, అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని హామీ ఇచ్చారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, శ్రీలక్ష్మి, జిటివి గణేష్, రోహిణి, హరితేజ, మణిచందన, ముమైత్ ఖాన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలను పోషించారు. 'నేను రెడీ' చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.