నీ పరిచయం.. ఈ వీడియో సాంగ్ ఏంట్రా ఇంత బావుంది
ABN , Publish Date - Sep 05 , 2026 | 05:48 AM
రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా నటిస్తున్న సినిమా ‘టార్టాయిస్’
రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా నటిస్తున్న సినిమా ‘టార్టాయిస్’ (Tortoise). అమృత చౌదరి (Amrutha Chowdary), అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ డ్రామా కలగలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.
కాగా తాజాగా ఈ చిత్రంలోని ‘నీ పరిచయం...’ అనే పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మంచి లవ్ ఫీల్‌తో సాగే ఈ పాట రిపీటెడ్‌గా వినేలా చేస్తుందని నిర్మాతలు తెలిపారు. ‘ఎగ్జైట్‌మెంట్‌తో సాగే సినిమాలో లవ్ ఎలిమెంట్స్ కలిపి, మంచి థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. నీ పరిచయం.. పాటను ఆస్కార్ చంద్రబోస్ గారు అద్భుతంగా రాశారు’ అని దర్శకుడు అన్నారు. ‘టార్టాయిస్’ యూనిక్ చిత్రమని రాజ్‌తరుణ్ చెప్పారు. సినిమాలో ఈ పాట మంచి సందర్భంలో వస్తుందని, సింగర్ చిన్మయి (Chinmayi Sripada) అద్భుతంగా ఆలపించారని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ (Anup Rubens) తెలిపారు.