Asuragana Rudra: నీ మాయలో పడేట్టుగా.. లిరికల్ సాంగ్
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:53 PM
ఇటీవల వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో అలరిస్తూ ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంటున్న యువ నటుడు నరేశ్ అగస్త్య.
ఇటీవల వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో అలరిస్తూ ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంటున్న యువ నటుడు నరేశ్ అగస్త్య. ఈ మధ్య గుర్రం పాపిరెడ్డి అనే సినిమాతో ఆకట్టుకున్న నరేశ్ కొత్తగా నటిస్తున్న చిత్రం అసురగణ రుద్ర (Asuragana Rudra).
జనక అయితే గనక ఫేమ్ సంగీర్తన (Sangeerthana Vipin ) కథానాయికగా నటిస్తోండగా అర్యన్ రాజేశ్, మురళీ శర్మ, శుభలేక సుధాకర్, శత్రు, రవి వర్మ, ప్రియా శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మురళీ కాట్రగడ్డ (Murali Katragadda) కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ చిత్రం నుంచి నీ మాయలో పడేట్టుగా (Nee Mayalo Padettuga) అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. చైతు సత్సంగి (Chaitu Satsangi) ఈ పాటకు సాహిత్యం అందించగా శేఖర్ చంద్ర (Shekar Chandra) సంగీతంలో రమ్య బెహరా (Ramya Behara), సిద్ధార్థ్ మీనన్ (Siddharth Menon) ఆలపించారు. సినిమా వేసవిలో ప్రేక్షకుల ఎదుటకు రానుంది.