NBK 111: బాలయ్య ‘కింగ్ ఆఫ్ క్యాస్’ ఎంట్రీ అదిరింది.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో
ABN , Publish Date - Jun 11 , 2026 | 10:26 PM
బాలకృష్ణహీరోగా, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించిన #KingOfChaos OST లిరికల్ వీడియో విడుదలై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన #KingOfChaos OST లిరికల్ వీడియో విడుదలై తాజాగా గురువారం సాయంత్రం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
సినిమాలో.. బాలకృష్ణ పాత్రలోని ఆవేశం, ఆధిపత్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ OSTకి అద్భుతమైన స్పందన లభిస్తోంది.తమన్ మాస్ బీట్స్‌కు సాహిత్యం తోడై, ఎలివేషన్‌తో నిండిన విజువల్స్ అభిమానుల్లో మరింత జోష్ నింపుతున్నాయి.
ప్రతి బీట్‌లో బాలయ్య మాస్ ఇమేజ్‌ను ఎలివేట్ చేస్తూ, సినిమాలో ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో ఈ పాట ద్వారా మేకర్స్ హింట్ ఇచ్చారు. కాగా విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.