Toxic: నయనతార స్మోకింగ్ సీన్.. సోషల్ మీడియాలో వివాదాల సెగ

ABN , Publish Date - Jul 26 , 2026 | 03:21 PM

యష్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. విడుదలకు ముందే వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది.

యష్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. విడుదలకు ముందే వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా విడుదలైన  'మనసాగదే' పాటలో నయనతార సిగరెట్ తాగుతూ కనిపించిన సన్నివేశం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ పాటలో యశ్, తారా సుతారియా మధ్య రొమాంటిక్ సన్నివేశాల కన్నా నయనతార  సిగరెట్‌ సీన్ ఎక్కువ వైరల్ అవుతోంది. సాంగ్ మధ్యలో యష్ సిగిరెట్ ఆఫర్ చేయగా నయన్ ఆ సిగిరెట్ తీసుకుని కాల్చుతుంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఇందులో నయన్ పోషిస్తున్న గంగ పాత్ర డిమాండ్ మేరకే  దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించినట్లు కొందరు భావిస్తున్నారు. మరికొందరు నయనతారలాంటి స్టార్ ఇలాంటి సన్నివేశాల్లో కనిపించడం సరైంది కాదని విమర్శిస్తున్నారు. 


లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార కెరీర్ ప్రారంభంలో 'బిల్లా -2' వంటి చిత్రాల్లో బోల్డ్ లుక్‌తో పాటు స్మోకింగ్ సన్నివేశాల్లో కనిపించారు. అయితే ఆ తర్వాత ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న,హోమ్లీ పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ వచ్చారు. ముఖ్యంగా వివాహం తర్వాత, ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత ఇలాంటి బోల్డ్ సన్నివేశాలకు దూరంగా ఉన్న నయనతార, ఇప్పుడు మళ్లీ స్మోకింగ్ సీన్‌లో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  

ఇంతకూ ముందు  విడుదలైన 'తబాహీ' పాటలో కూడా  బోల్డ్ విజువల్స్ చర్చకు దారితీయగా, ఇప్పుడు 'మనసాగదే' పాటలోని ఈ స్మోకింగ్ షాట్ మరోసారి 'టాక్సిక్' సినిమాను వార్తల్లో నిలిపింది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  

Updated Date - Jul 26 , 2026 | 03:35 PM