Heroines Vacation: వెకేషన్‌లో ముగ్గురు హీరోయిన్లు.. ఫొటోలు వైరల్..
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:02 PM
నయనతార, త్రిష సౌత్ సినిమాలో అడుగుపెట్టి 20 వసంతాలు దాటుతున్నా.. ఇప్పటికీ అదే గ్లామర్.. అదే వేగంతో సినిమాలు చేస్తున్నారు.
నయనతార, త్రిష సౌత్ సినిమాలో అడుగుపెట్టి 20 వసంతాలు దాటుతున్నా.. ఇప్పటికీ అదే గ్లామర్.. అదే వేగంతో సినిమాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య కొన్నాళ్ల క్రితం ఓ సినిమా విషయంలో చిన్న వార్ జరిగిందంటూ ప్రచారం జరిగింది. ఇద్దరికీ మాటలు లేవని వార్తలొచ్చాయి. తాజాగా నయన్, త్రిష పెట్టిన పోస్ట్ ఆ రూమర్స్‌కు చెక్ పెట్టినట్లయింది. వీరిద్దరూ కలిసి టూర్‌కి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు సర్‌ప్రైజ్ అవుతున్నారు. కొంతకాలంగా మాట్లాడుకోని ఇద్దరూ వెకేషన్‌కి ఎలా వెళ్లారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
అయితే నయన్, త్రిష తాజాగా దుబాయ్ టూర్‌కి వెళ్లారు. అక్కడ సముద్రంలో యాచ్‌పై సేదతీరుతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలను షేర్ చేసిన నయనతార ‘ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తాఫా అంటూ.. తమ ేస్నహ బంధానికి ఎండింగ్ లేదని రాసుకొచ్చారు. వీరితోపాటు మరో హీరోయిన అసీన్ కూడా ఈ ట్రిప్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.