Navdeep: యదార్థ సంఘటన ఆధారంగా 'మొహబ్బత్'
ABN , Publish Date - Oct 03 , 2026 | 05:30 PM
సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా రూపొందుతున్న చిత్రం 'మొహబ్బత్'. ఏబీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై మ్యాక్ దర్శకత్వంలో అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా రూపొందుతున్న చిత్రం 'మొహబ్బత్'. ఏబీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై మ్యాక్ దర్శకత్వంలో అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యకమ్రానికి ముఖ్య అతిథిగా హీరో నవదీప్, దర్శకుడు కరుణకుమార్ హాజరయ్యారు. నవదీప్ టీజర్‌ను ఆవిష్కరించారు.
నవదీప్ మాట్లాడుతూ 'నిర్మాత అఫ్రోజ్ అమెరికాలో జాబ్ చేసి...వాళ్ల సొంత ఊరిలో స్కూల్ కట్టించడం.. ఇప్పుడు తన డ్రీమ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఎంతో డేడికేటెడ్ నిర్మాతలుగా కనిపిస్తున్నారు. కొత్తవాళ్లను ఈసినిమా ద్వారా దర్వకుడు ఎంకరైజ్ చేశాడు. ఈ సినిమా విజువల్స్, టీజర్ బాగుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో సంతోష్ మాట్లాడుతూ '' కడపలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తీసిన మ్యూజికల్ ఎమోషనల్ లవ్‌స్టోరి ఇది. నిర్మాత సినిమా మీద పాషన్‌తో ఈ సినిమా నిర్మించాడు. ఈ సినిమాకు ఫోటోగ్రఫీ, మ్యూజిక్ ప్రధాన బలం. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది. అజయ్ ఘోష్ లాంటి సీనియర్ నటుడితో నటించడం వల్ల ఎంతో నేర్చుకున్నాను' అన్నారు.
నిర్మాత అఫ్రోజ్ షేక్ మాట్లాడుతూ '' యూఎస్ లో 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఓ మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మించాను. ఈ స్టోరీ నచ్చింది.తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. సినిమా కూడా అందరికి నచ్చుతుంది. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నాం. ఈసినిమా కోసం ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ ఎంతో కో ఆపరేటివ్ చేశారు' అన్నారు..
దర్శకుడు మ్యాక్ మాట్లాడుతూ '' ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డాం. ఈ కథను నమ్మి ఈ సినిమా కోసం నిర్మాత ఎంతో ఖర్చుపెట్టారు. కొత్త విషయం చెప్పాలన్న తాపత్రయంతో ఈ సినిమా చేశాం. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించారు. బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్దదు. ఈ సినిమాలో అజయ్ ఘోష్ పాత్ర చాలా కాలం గుర్తుంటుంది అన్నారు.