జడలురో.. హడలురో! నాని.. ఆయా షేర్ పాటొచ్చేసింది
ABN , Publish Date - Feb 24 , 2026 | 09:44 PM
దసరా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ది ప్యారడైజ్.
దసరా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత నాచురల్ స్టార్ నాని (Nani), డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ది ప్యారడైజ్ (The Paradise). మార్చిలోనే థియేటర్లకు రావాల్సిన ఈ మూవీ షూటింగ్ చిత్రీకరణ బ్యాలన్స్ ఉండడంతో ఆగస్టు 21న రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే.. సినిమా ఆరంభం కాకమునుపే ఆకాశన్నంటే అంచనాలు ఉన్న ఈ చిత్రం నుంచి ఓ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ పెద్ద రచ్చే చేశాయి. ఈ క్రమంలో తాజాగా మంగళవారం నాని జన్మదినం కావడంతో ది ఫ్యారడైజ్ సినిమా నుంచి ఆయా షేర్ (Aaya Sher) అంటూ సాగే హుషారైన పాటను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ (Kasarla Shyam) ఈ గీతానికి సాహిత్యం అందించగా అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతంలో అద్దుల జంగి రెడ్డి (Addula Jangireddy), అర్జున్ చాండీ (Arjun Chandy) ఆలపించారు.
ఇక ఈ పాటను స్లమ్‌లో అనేక మంది జనాల మధ్య హీరోను ఎలివేట్ చేస్తూ సాగగా పాట మధ్యలో నాని స్టెప్పులతో అదరగొట్టాడు. పాట కూడా కొత్తగా ఉండి నాని అబిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా పాట రిలీజ్ అయిన నిమిషాల్లోనే 10 మిలయన్స్‌కు పైగా వ్యూస్ దక్కించుకుని కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కాగా పాటలో నాని అసాంతం రెండు జడలతోనే కనిపించడంతో మనం నానినే చూస్తున్నామా లేక మరెవరోనా అనే ఫన్నీ కామెంట్లు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ పాటపై మీరూ ఓ లుక్ వేయండి.