చిరంజీవి, బాలయ్య ఇండస్ట్రీ పెద్దలే.. కానీ!: నట్టి కుమార్

ABN , Publish Date - Jun 12 , 2026 | 08:41 PM

చిన్న సినిమాల నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని చెబుతూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు నిర్మాత నట్టి కుమార్ ఓ వినతి పత్రం అందించారు. అందులో చిన్న నిర్మాతల తరపున, అందరి ఏకగ్రీవ నిర్ణయం మేరకు వినతి పత్రాన్ని కమిటీ ముందు సమర్పిస్తున్నట్లుగా తెలిపారు.

Natti Kumar About Chiranjeevi and Balayya

చిన్న సినిమాల నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని చెబుతూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) ఓ వినతి పత్రం అందించారు. అందులో చిన్న నిర్మాతల తరపున, అందరి ఏకగ్రీవ నిర్ణయం మేరకు వినతి పత్రాన్ని కమిటీ ముందు సమర్పిస్తున్నట్లుగా తెలిపారు. అందులో.. చిన్న సినిమాల నిర్మాతలకు న్యాయం జరిగే విధంగా శాశ్వత పరిష్కారం చూపించవలిసిందిగా కోరారు. అనంతరం శుక్రవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. మరీ ముఖ్యంగా చిన్న సినిమాల మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. చిన్న సినిమాలకు మధ్యాహ్నం 2.30 గంటల షోను కేటాయించాలి. అలాగే టికెట్ రేట్లలో అసమానతలు ఉండకూడదు. చిన్న సినిమాలకు సరైన షోలు కేటాయించడం లేదు. ఇంకా చిన్న సినిమాల విడుదల సమయంలో థియేటర్ల కొరత ఎక్కువగా ఉంటుంది. ట్రైలర్, పోస్టర్ ఈవెంట్స్ నిర్వహించి ప్రమోషన్స్ చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది.


తెలంగాణలో టికెట్ రేట్ల విషయంలో స్పష్టత అవసరం. త్వరలోనే ఆ స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాము. చిన్న సినిమాల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు ఉండాలి. చిన్న సినిమాలు బతికితేనే తెలుగు సినిమా పరిశ్రమ బలపడుతుంది. పెద్ద సినిమాలకు ఉన్న అవకాశాలు చిన్న సినిమాలకు కూడా సమానంగా దక్కాలి. టికెట్ రేట్లు, షోల కేటాయింపులో సమ న్యాయం కావాలి. చిన్న నిర్మాతల కష్టాన్ని కాపాడకపోతే కొత్త ప్రతిభకు అవకాశం ఉండదు. థియేటర్ వ్యవస్థలో మార్పులు తీసుకురాకపోతే చిన్న సినిమా పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. సబ్ కమిటీ మీటింగ్‌లో వీటిపై చర్చ జరగాలి. సభ్యులు చిన్న సినిమాలకు ఫేవర్‌గా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాము.


చిరంజీవి, బాలకృష్ణ (Balakrishna) ఇద్దరూ ఇండస్ట్రీ పెద్దలే. చిరంజీవి (Chiranjeevi) అందరినీ పిలిచి మాట్లాడుతున్నారు. మేము వారిని టైమ్ తీసుకుని కలుస్తాము. దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఉన్నారు. అన్ని విషయాలు పట్టించుకుంటున్నారు. పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాలయ్య బాబు ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. ఆయన మా సమస్యలను వింటాను అంటే కచ్చితంగా వెళ్లి కలిసి తెలియజేస్తాం. చిన్న నిర్మాతలందరం, వారి టైమ్ తీసుకుని వెళ్లి కలుస్తాం. మా సమస్యలను విన్నవిస్తాం. సబ్ కమిటీ వల్ల సమస్యల పరిష్కారం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నాము..’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

ఆ రోజు బాలయ్య ఆశీర్వదించినట్లే జరగడంతో.. ఆనందంలో నారా బ్రహ్మణి!

ఎన్టీఆర్ లైనప్‌లో ఊహించని ట్విస్ట్.. నెల్సన్ సినిమా లేనట్టేనా

నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ

Updated Date - Jun 12 , 2026 | 08:42 PM