Pawan Kalyan: నటకిరీటికి పద్మశ్రీ.. సత్కరించిన పవన్ కళ్యాణ్

ABN , Publish Date - Feb 04 , 2026 | 07:46 PM

టాలీవుడ్ సీనియర్ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ని మర్యాదపూర్వకంగా కలిశారు.

Pawan Kalyan

Pawan Kalyan: టాలీవుడ్ సీనియర్ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ని మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మశ్రీ అవార్డుకు తన పేరును సిఫార్సు చేయడంలో కీలక పాత్ర పోషించి, తనకు అండగా నిలిచినందుకు రాజేంద్ర ప్రసాద్ ఉప ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాజేంద్ర ప్రసాద్ ని ఆత్మీయంగా హత్తుకుని, ఘనంగా సత్కరించారు. పద్మశ్రీ వంటి గొప్ప గౌరవం దక్కడం తెలుగు వారందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు.

సత్కారం అనంతరం పవన్ కళ్యాణ్ - రాజేంద్ర ప్రసాద్ తో కొద్దిసేపు ముచ్చటించారు. తనకెంతో ఇష్టమైన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కి పద్మ పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. 'మీరు సినిమాల్లో పండించే హాస్యం, చూపించే నటన ఎంతోమందికి స్ఫూర్తి. ఈ పురస్కారం మీకు ఎప్పుడో రావాల్సింది, ఇప్పటికైనా సరైన గుర్తింపు దక్కడం సంతోషంగా ఉంది' అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

రాజేంద్ర ప్రసాద్ సైతం తనను వెన్నుతట్టి ప్రోత్సహించినందుకు, ప్రభుత్వం తరపున మద్దతు తెలిపినందుకు డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటివరకు రాజేంద్ర ప్రసాద్.. పవన్ కళ్యాణ్ కలిసి ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. ముందు ముందు వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో అయినా కనిపిస్తారేమో చూడాలి.

Updated Date - Feb 04 , 2026 | 07:46 PM