విజ‌య్‌, ర‌ష్మిక జంట‌కు.. ప్ర‌ధాని మోదీ శుభాకాంక్ష‌లు

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:28 PM

విజ‌య్ దేవ‌రకొండ, ర‌ష్మిక మంద‌న్నల వివాహం గురువారం ఉద‌య్‌పూర్ లో జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే.

Vijay Deverakonda

విజ‌య్ దేవ‌రకొండ (Vijay Deverakonda), ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) ల వివాహం మ‌రో రోజులో (గురువారం) ఉద‌య్‌పూర్ (Udaipur) లో జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే నూత‌న వ‌ధూవ‌రులు, స‌మీప బంధువులు ఇప్ప‌టికే క‌ల్యాణ వేదిక‌కు చేరుకోగా సినీ, రాజ‌కీయ సెల‌బ్రిటీలు ఒక్కొక్క‌రే అక్క‌డ‌కు చేరుకుంటున్నారు. హల్దీ, సంగీత్ వంటి వ‌రుస సెల‌బ్రేష‌న్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే.. విజ‌య్‌, ర‌ష్మిక వివాహం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ (Narendra Modi) ఈ జంట‌కు ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Modi Vijay Deverakonda

ఈ లేఖ‌లో.. శ్రీమతి మాధవి గారు, గోవర్ధన్ రావు దేవరకొండ గారు మీరు పంపిన వివాహ ఆహ్వ‌నం అందిందని అంటూ, దేవ‌ర‌కొండ‌, మంద‌న్న కుటుంబాల‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఇన్నాళ్లు తెర‌పై అల‌రించార‌ని, ఇక‌పై విజ‌య్‌, ర‌ష్మిక జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం ఆరంభం అవుతున్న‌ద‌ని, వారు క‌ల‌కాలం క‌ల‌సి ఉండాల‌ని, పరస్పర ప్రేమ, ఆలోచనతో బాధ్యతలను పంచుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని, బలాలను తెలుసుకుని, భాగస్వాములుగా జీవన ప్రయాణం కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు. ఈ సందర్భంగా వధూవరులకు, కుటుంబ సభ్యులకు నా ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు అంటూ వ్రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్‌ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Updated Date - Feb 25 , 2026 | 01:35 PM