RN 23: నారా రోహిత్ కొత్త చిత్రం.. ప్రేమ.. వినోదం

ABN , Publish Date - May 07 , 2026 | 09:43 AM

నారా రోహిత్ హీరోగా చినిమిల్లి మణికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం ‘RN23’ అధికారికంగా ప్రకటించారు.

Nara Rohith

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే కథానాయకుడు నారా రోహిత్‌ (Rohith Nara) నటిస్తున్న కొత్త చిత్రాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. ‘ఆర్‌ ఎన్‌ 23’ ( #RN23)అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌కు చినిమిల్లి మణికుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. ‘

Nara Rohith

పౌటింగ్‌ సూన్‌’ అనే ఉపశీర్షికతో ఉన్న ఈ పోస్టర్‌ ఆకట్టుకుంది. కరణ్‌ సి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై భరత్‌ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమ, వినోదం, భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. యూత్‌తో పాటూ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఈ చిత్రం మెప్పిస్తుందని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించి సెట్స్‌ మీదకు తీసుకెళ్తున్నారు.

Updated Date - May 07 , 2026 | 09:43 AM