మెగాస్టార్ అల్లుడిగా నారా రోహిత్..

ABN , Publish Date - May 31 , 2026 | 01:22 PM

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే విశ్వంభరని ఫినిష్ చేసే పనిలో ఉన్న చిరు.. ఈ మధ్యనే మెగా 158 ని మొదలుపెట్టారు.

Mega 158

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే విశ్వంభరని ఫినిష్ చేసే పనిలో ఉన్న చిరు.. ఈ మధ్యనే మెగా 158 ని మొదలుపెట్టారు. చిరుకు వాల్తేరు వీరయ్య లాంటి హిట్ సినిమాను అందించిన బాబీ ఇప్పుడు మెగా 158 కి దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ మధ్యనే ఎంతో గ్రాండ్ గా ఈ సినిమా లాంచ్ అయ్యింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు గెస్ట్ గా విచ్చేశారు. ఈ చిత్రంలో చిరు సరసన ప్రియమణి నటిస్తోండగా.. వారి కూతురిగా అనస్వర రాజన్ నటిస్తోందని టాక్.


ఇక చిరు సినిమా అంటే.. ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. ? అని ఎదురుచూస్తూ ఉంటుంది. అంతేకాకుండా చిరు సినిమా నుంచి ఏ చిన్న లీక్ అయినా అది సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా మెగా 158 నుంచి ఒక లీక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తోందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు నారా వారబ్బాయి నారా రోహిత్ ఒక గెస్ట్ రోల్ లో నటించనున్నాడని టాక్ నడుస్తోంది.


సుందరకాండ సినిమాతో రీఎంట్రీ హిట్ అందుకున్న నారా రోహిత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మెగా 158 లో రోహిత్ ఒక చిన్న గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. చివర్లో చిరు కూతురికి వరుడిగా నారా రోహిత్ కనిపించనున్నాడని, చిన్న పాత్రనే అయినా.. చిరు సినిమాలో అనేసరికి ఆయన మీద గౌరవంతో ఒప్పుకున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఇదే కనుక నిజమైతే రోహిత్ కి ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Updated Date - May 31 , 2026 | 02:20 PM