నాని ప్యారడైజ్ కి కేటీఆర్ సపోర్ట్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న పోస్ట్

ABN , Publish Date - Sep 26 , 2026 | 03:17 PM

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ది ప్యారడైజ్ (The Paradise). ఎన్నో అంచనాల నడుమ ఈ గురువారం రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది.

KTR

నేచురల్ స్టార్ నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ది ప్యారడైజ్ (The Paradise). ఎన్నో అంచనాల నడుమ ఈ గురువారం రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. సినిమా మొత్తం హింస, రక్తపాతం తప్ప ఏమి లేదని, శ్రీకాంత్ ఓదెల కథ మొత్తాన్ని గాడి తప్పించాడని విమర్శలు ముంచెత్తాయి. అంతేకాకుండా నాని.. మాస్ ఇమేజ్ ని నిలబెట్టుకోవడం కోసమే ఇలాంటి సినిమా తీశాడని, కానీ ఆ గుర్తింపు మాత్రం రాలేదని చెప్పుకొస్తున్నారు. ఇక ఎన్ని విమర్శలు వచ్చినా కలక్షన్స్ మాత్రం రికార్డులు సృష్టిస్తున్నాయి. కేవలం రెండే రోజుల్లో రూ. 114 కోట్లు రాబట్టి ప్యారడైజ్ నాని కెరీర్‌లోనే అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న చిత్రంగా నిలిచింది.


ఇక ఇప్పుడు ఈ సినిమా రన్‌కు బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ నుంచి ఊహించని సపోర్ట్ లభించింది. శనివారం రాత్రి తాను ప్యారడైజ్ సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్తున్నట్లు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'చాలా ఏళ్ల తర్వాత ఈ రోజు రాత్రి నా ఫేవరెట్ యాక్టర్లలో ఒకరైన నాని, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్తున్నాను' అని ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.


మరొకవైపు, ఈ సినిమాలో ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్ ప్రేక్షకుల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజజీవిత వ్యక్తిత్వాన్ని పోలి ఉన్న ఒక సీన్ సినిమాలో హైలైట్‌గా నిలిచిన విషయం తెల్సిందే. ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో ప్రియదర్శి.. కేసీఆర్ గా కనిపించాడు. థియేటర్లలో ఈ సన్నివేశానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుండటంతో, స్వయంగా కేటీఆర్ సినిమా చూడటానికి వెళ్తుండటంపై పొలిటికల్ అండ్ ఫిల్మ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

కేటీఆర్ కూడా సినిమా చూడడానికి వెళ్తున్నా అని చెప్పడంతో ప్యారడైజ్ కి మరింత బలం చేకూరినట్లు అయ్యింది. సినిమా చూసాక కేటీఆర్ ఇచ్చే రివ్యూ ఎలా ఉంటుందో అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మూడో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బలంగా ఉన్నాయి. మొదటి వీకెండ్ ముగిసే సమయానికి ది ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త మైలురాళ్లను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ముందు ముందు నాని ఏ రికార్డులు తిరగరాస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి:

Divyabharathi: ఒరేయ్.. బికినీ ఫోటోలు నిజమనుకున్నారు కదరా..

నానికే ఈ రేంజ్ లో ఉంటే.. దేవరకొండ పరిస్థితి ఏంటో

ప్యారడైజ్ ఎఫెక్ట్.. ఆగిపోయిన చిరు- శ్రీకాంత్ ఓదెల సినిమా

Updated Date - Sep 26 , 2026 | 03:30 PM