బ్లడీ రోమియో.. అంటున్న నేచురల్ స్టార్! గ్లింప్స్ అదిరింది
ABN , Publish Date - Feb 24 , 2026 | 11:54 AM
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించబోతున్న తాజా చిత్రానికి 'బ్లడీ రోమియో' అనే పేరు ఖరారు చేశారు. సమ్మర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది.
ఫిబ్రవరి 24 నేచురల్ స్టార్ నాని (Nani) పుట్టిన రోజు. ఈ సందర్భంగా నాని కొత్త సినిమా టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. నాని హీరోగా సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో నిహారిక ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి (Venkat Boyanapalli) ఓ సినిమాను ప్రకటించారు. ఇవాళ ఆ సినిమా పేరును అధికారికంగా వెల్లడిస్తూ, ఓ యానిమేషన్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు 'బ్లడీ రోమియో' (Bloody Romeo) అనే పేరు పెట్టారు. తెలుగుతో పాటు ప్రధాన భారతీయ భాషల్లో ఇది పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకోబోతోంది.
ప్రస్తుతం నాని 'ది ప్యారడైజ్' (The Paradise) సినిమా చేస్తున్నారు. అది ఆగస్ట్ 21న విడుదల కానుంది. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిగానే నాని 'బడ్లీ రోమియో' షూటింగ్ లో పాల్గొంటారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌ను చూస్తే... పైకి చెఫ్‌గా కనిపించినా ఇందులోని హీరో ఓ పెద్ద గ్యాంగ్‌స్టర్ అన్నట్టుగా టీజర్ చివరిలో చూపించారు. దీనికి వెన్నెల కిశోర్ (Vennela Kishore) వాయిస్ ఇవ్వడం విశేషం. 'నేచురల్ స్టార్ నాని ఇన్ ఏ విట్టీ రోల్' అని కార్డ్ వేయడంతో, సుజిత్ మార్క్ హాలీవుడ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు ఇందులో నాని తరహా కామెడీకీ బాగానే చోటు ఉంటుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో నాని సరసన బాలీవుడ్ అందాల భామ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటించ బోతోందని వార్తలు వస్తున్నాయి. మరి ఆమె ఎంట్రీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.