నెగిటివ్ టాక్‌తోనూ.. ‘ది ప్యారడైజ్’ విద్వంసం
ABN , Publish Date - Oct 09 , 2026 | 07:10 AM
భారీ అంచనాలతో గత నెలలో థియేటర్లకు వచ్చిన నాని ‘ది ప్యారడైజ్’ చిత్రం విజయవంతంగా మూడో వారంలోకి అడుగు పెట్టింది.
భారీ అంచనాలతో గత నెలలో థియేటర్లకు వచ్చిన నాని ‘ది ప్యారడైజ్’ చిత్రం విజయవంతంగా మూడో వారంలోకి అడుగు పెట్టింది. అంతేగాకుండా బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరమైన లెక్కలను నమోదు చేసింది. ట్రైలర్ కూడా లేకుండానే మొదటి రోజు రూ.80 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది నాని నటించిన ‘ది ప్యారడైజ్’ (The Paradise).
అయితే రిలీజ్ తర్వాత వచ్చిన విపరీతమైన నెగిటివ్ టాక్ వల్ల ఈ భారీ చిత్రం రెండో వారం నుంచే తక్కువ థియేటర్లకు పరిమితమయింది. అయినప్పటికీ తన స్టార్ డమ్‌తో మొదటి వారం గట్టి పోటీ ఇచ్చిన నాని, ఇప్పటి వరకు ఏకంగా రూ.170 కోట్ల కలెక్షన్లు రాబట్టడం విశేషం. నెగిటివిటీ నడుమ కూడా ఈ స్థాయి వసూళ్లు సాధించిన ఈ సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ లెక్కలు మరోలా ఉండేవేమో.