'మృత్యుంజయ్' సినిమా చూసి.. నాని మెచ్చుకున్నారు

ABN , Publish Date - Mar 06 , 2026 | 09:51 AM

మృత్యుంజయ్ సినిమా చూసి.. నాని మెచ్చుకున్నారని శ్రీ విష్ణు అన్నారు.

Mrithyunjay

మృత్యుంజయ్ (Mrithyunjay) ప్రీమియర్ షోకు వస్తున్న‌ స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని సినిమాను అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారని కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు అన్నారు. నాచుర‌ల్ స్టార్‌ నాని గారు అంత‌కుముందు రాత్రి మూవీ చూసి మెచ్చుకున్నారన్నారు. మంచి కథా బలంతో వచ్చే చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది అని మరోసారి రుజువైంది. సినిమాను సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరుతున్నా' అని శ్రీ విష్ణు (Sree Vishnu) అన్నారు.

ఆయన కథానాయకుడుగా హుస్సేన్ షా (Hussain Sha Kiran) తెరకెక్కించిన చిత్రమిది రేఖా మోనికా జాన్ (rebba mounika john) కథానాయిక. రైట్ బాక్స్ మీడియా సిక్సర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యాన ర్లఫై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా ప్రీమియర్ షో ప్రెస్మిట్ నిర్వహించారు..


ఈ సంద‌ర్భంగా నిర్మాత సందీప్ గుఱ్ఱం (Gunnam Sandeep) మాట్లాడుతూ 'ఈ చిత్రంలో శ్రీ విష్ణు చాలా కొత్తగా కనిపిస్తారు. అందర్నీ ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది' అని అన్నారు. డ్రాగన్ కోసం ఎన్టీఆర్ కొత్త లుక్‌లో ఉన్నాడ‌ని, దానిని ఇప్పుడే రివీల్ చేయ‌ద‌లుచుకోలేద‌ని అందు వ‌ళ్లే ఈవెంట్‌కు రాలేదని అన్నారు. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ 'నాని రివ్యూ ఎప్పుడూ తప్పదు. నా ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన ఎన్టీఆర్ గారికి కృతజ్ఞతలు' అని అన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 10:10 AM