నాని లేకపోతే ఈ సినిమా లేదు.. ‘అలియాస్ రుక్మిణి’పై నితిన్ కామెంట్స్!

ABN , Publish Date - Nov 27 , 2026 | 06:23 AM

నితిన్, ఆఫియా సయ్యద్ జంటగా నటించిన ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా తన కెరీర్‌లోనే ప్రత్యేకమైనదని నితిన్ పేర్కొన్నారు.

‘అలియాస్‌ రుక్మిణి’ (Alias Rukmini) నా కెరీర్‌లోనే ప్రత్యేక చిత్రం. గతంలో కొన్ని సినిమాలు లెక్కలు వేసుకుని చేశాను. ఈ చిత్రానికి ఎలాంటి లెక్కలు వేసుకోకుండా కథ నచ్చి చేశాను. దర్శకుడు మురళీకాంత్‌ టాలీవుడ్‌ రాజ్‌కుమార్‌ హిరాని అని నా ఫీలింగ్‌. నాని (Nani) లేనిదే ఈ సినిమా లేదు’ అని కథానాయకుడు నితిన్ (Nithiin) అన్నారు.

ఆయన, ఆఫియా సయ్యద్ (Aafiya Sayed) జంటగా దండోరా ఫేమ్‌ మురళీకాంత్ (Murali Kanth Devasoth) దర్శకత్వంలో నాని సమర్పిస్తున్న చిత్రం ‘అలియాస్‌ రుక్మిణి’. దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 4న విడుదలవుతోంది. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ కార్యక్రమంలో మురళీకాంత్‌ మాట్లాడుతూ ‘ఇది చాలా కష్టపడి.. ఇష్టపడి చేసిన అందమైన సినిమా’ అని చెప్పారు. దీప్తి గంటా మాట్లాడుతూ ‘ఈ చిత్రం మీ అందరికీ అద్భుతమైన సినిమాటిక్‌ అనుభూతిని అందిస్తుంది’ అని తెలిపారు.

Updated Date - Nov 27 , 2026 | 06:29 AM