NBK: ఎన్టీఆర్.. ఆ పేరు వింటే రక్తం ఉప్పొంగుతుంది

ABN , Publish Date - Jan 18 , 2026 | 10:17 AM

తెలుగు అనే మూడు అక్షరాలు వింటే.. నా  ఒళ్ళు  పులకరిస్తుంది. అలాగే ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల వినగానే నా రక్తం ఉప్పొంగుతుంది'

'తెలుగు అనే మూడు అక్షరాలు వింటే.. నా  ఒళ్ళు  పులకరిస్తుంది. అలాగే ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల వినగానే నా రక్తం ఉప్పొంగుతుంది' అని నందమూరి బాలకృష్ణ అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఉదయం నుంచి అభిమానులు, ప్రముఖులు పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, హీరో కల్యాణ్ రామ్, మంత్రి లోకేశ్, నందమూరి బాలకృష్ణ, ఎంపీ పురందేశ్వరి.. సహా కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కు నివాళులు అర్పించేందుకు ప్రముఖులు క్యూ కడుతున్నారు. 

Updated Date - Jan 18 , 2026 | 10:21 AM