క్లాస్ డైరెక్టర్ తో మాస్ బాలయ్య..

ABN , Publish Date - Mar 04 , 2026 | 06:18 PM

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రాబోయే సినిమాలు ఇవే అంటూ రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. బాలయ్య హీరోగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వెంకట్ సతీశ్ కిలారు ఓ సినిమా నిర్మిస్తున్నారు.

Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రాబోయే సినిమాలు ఇవే అంటూ రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. బాలయ్య హీరోగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వెంకట్ సతీశ్ కిలారు ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ఆరంభం కానుంది. ఇదిలా ఉండగానే బాలకృష్ణ కథానాయకునిగా వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో ఓ చిత్రం ఉంటుందని విశేషంగా వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాను బాలయ్యతో ఇంతకు ముందు 'వీరసింహారెడ్డి' వంటి బంపర్ హిట్ నిర్మించిన 'మైత్రీమూవీ మేకర్స్' సంస్థ నిర్మించనుంది. "మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం" వంటి చిత్రాలతో విలక్షణ దర్శకునిగా పేరొందారు వివేక్ ఆత్రేయ. మొదటిసారి సీనియర్ స్టార్ బాలకృష్ణతో పనిచేయబోయే వివేక్ ఆత్రేయ ఎలాంటి సబ్జెక్ట్ ను తయారు చేశారో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

బాలయ్యతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన తొలి చిత్రం 'వీరసింహారెడ్డి'... ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. సినిమా బిగ్ హిట్ గా నిలచింది... ఈ చిత్రంతోనే బాలయ్యతో అటు నిర్మాణ సంస్థ, ఇటు దర్శకుడు గోపీచంద్ తొలిసారి కలసి పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బాలయ్యతో తాము నిర్మించబోయే చిత్రానికి వివేక్ ఆత్రేయను దర్శకునిగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. క్లాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ.. మాస్ బాలయ్యను ఏ రేంజ్ లో చూపిస్తారో అని ఫ్యాన్స్ యోచిస్తున్నారు.

Updated Date - Mar 04 , 2026 | 06:24 PM