NBK111: నాకు గురి పెట్టాలంటే.. బుల్లెట్స్‌కు బ‌లుపు ఉండాలి.. గ‌న్స్‌కు గ‌ట్స్ ఉండాలి! బాల‌య్య అద‌ర‌గొట్టాడు పో

ABN , Publish Date - Sep 06 , 2026 | 07:45 PM

మోక్షజ్ఞ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని అదివారం ఒక అదిరిపోయే NBK111 నుంచి అప్‌డేట్‌ను విడుద‌ల చేశారు.

nbk 111

బాల‌కృష్ణ అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న రోజు వ‌చ్చేసింది. అంతేగాక అనేక అనుమానాల‌కు చెక్ పెడుతూ ఫ్యాన్స్ ఎదురు చూపుల‌కు పుల్‌స్టాప్ పెట్టేశారు. అదివారం మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagna Teja) జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని NBK111 నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్‌ను విడుద‌ల చేశారు. సినిమా టైటిల్ 'దాదా' అని అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో పాటు డిసెంబ‌ర్ 24న సినిమాను థియేట‌ర్ల‌కు తీసుకు వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో రూపొందుతోన్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ NBK111. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో, ఈ తాజా చిత్రంపై ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీపడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ ఫస్ట్ గ్లింప్స్‌లో బాలయ్య అల్ట్రా స్టైలిష్, పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించి మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు.

ఇక తాజాగా విడుద‌ల చేసిన గ్లింప్స్ స్ట‌న్నింగ్‌గా ఉండి బాల‌య్య నుంచి ఫ్యాన్స్ అశించే కోరుకునే అంశాల‌ను అన్నింటినీ రంగ‌రించి మ‌రీ సినిమాను స్టైలీష్‌గా రూపొందిస్తున్న‌ట్లు స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది. నాకు గురి పెట్టాలంటే బుల్లెట్స్‌కు బ‌లుపు ఉండాలి.. గ‌న్స్‌కు గ‌ట్స్ ఉండాలి వంటి డైలాగుల‌తో అద‌ర‌గొట్టారు. అయితే..కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో మంచు మ‌నోజ్ ప్ర‌తినియ‌కుడిగా న‌టిస్తుండ‌డం విశేషం.

Updated Date - Sep 06 , 2026 | 07:45 PM