శేఖర్ కమ్ములతో బాలయ్య.. అసలేం జరుగుతోందిరా
ABN , Publish Date - Apr 30 , 2026 | 08:48 PM
తెలుగునాట ఓ అరుదైన కాంబినేషన్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
టాలీవుడ్‌లో క్లాస్ సినిమాల దర్శకుడు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు శేఖర్ కమ్ముల (Sekhar Kammula). ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ లాంటి బ్యూటీఫుల్ క్లాసిక్స్ ను తెరకెక్కించడమే కాకుండా లీడర్ వంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీని కూడా తీయగలనని నిరూపించుకున్నాడు. ఇక గతేడాది ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ లో చేసిన కుబేర చిత్రంతో కథలో ఎంత డెప్త్‌కైనా వెళ్లగలనని మరోసారి నిరూపించారు. ఇప్పుడు ఆయన చూపు నటసింహం మీద పడింది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఒక క్లాస్ డైరెక్టర్ మాస్ కా బాస్ అయిన బాలకృష్ణ (Balakrishna) మూవీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందనే దానిపై ఇండస్ట్రీ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.
మరోవైపు మన బాలయ్య బాబు.. వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్నారు. అయితే, చాలా కాలంగా బాలయ్య మనసులో ఒక బలమైన కోరిక ఉంది. అదే.. ఒక పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ చేయడం..! కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, కథలో డెప్త్ ఉండి.. జనాన్ని ఆలోచింపజేసే పాత్ర కోసం ఆయన వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల చెప్పిన ఒక పాయింట్ బాలయ్యను పూర్తిగా కట్టిపడేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఈ క్రేజీ కాంబో గురించి ఇండస్ట్రీలో చాలా మంది చర్చించుకుంటున్నారు. శేఖర్ కమ్ముల సినిమాల్లో ఒక నేచురాలిటీ ఉంటుంది, సమాజం పట్ల ఒక బాధ్యత కనిపిస్తుంది. అటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్‌లో ఉండే ఆ ఇంటెన్సిటీకి శేఖర్ మార్క్ మేకింగ్ తోడైతే.. అది ఒక మాస్టర్ పీస్ అవుతుందనడంలో సందేహం లేదు. వీరిద్దరి మధ్య కుదిరిన ఆ ఇంట్రెస్టింగ్ లైన్ ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమాలో బాలయ్య ఒక పవర్ ఫుల్ లీడర్‌గా కనిపిస్తారా..? లేక సమాజంలోని లోపాలను ప్రశ్నించే ఒక సామాన్యుడిగా కనిపిస్తారా..? అనేది ఇంకా సస్పెన్స్. శేఖర్ కమ్ముల కథల్లో ఉండే భావోద్వేగాలు.. మరియు బాలయ్య డైలాగ్ డెలివరీలో ఉండే గంభీర్యం.. ఈ రెండూ వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనుక అఫీషియల్‌గా అనౌన్స్ అయితే, టాలీవుడ్ లెక్కలన్నీ మారిపోవడం గ్యారెంటీ! మాస్ సినిమాలంటే పడిచచ్చే అభిమానులు.. క్లాస్ సినిమాలను ఇష్టపడే సినీ ప్రియులు.. అందరినీ ఒకే థియేటర్‌లోకి రప్పించగల సత్తా ఈ కాంబినేషన్‌కు ఉంది. మరి శేఖర్ కమ్ముల కలంలో పుట్టిన ఆ రాజకీయం.. బాలయ్య గళంలో ఎలా ప్రతిధ్వనిస్తుందో చూడాలి.