బాలకృష్ణ కొత్త ఇంటికి భూమి పూజ..

ABN , Publish Date - Feb 20 , 2026 | 02:01 PM

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (NBK) నూతన గృహానికి శంకుస్థాపన చేశారు.

సీనియర్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (NBK) నూతన గృహానికి శంకుస్థాపన చేశారు. హిందూపురంలో (hindupuram) నియోజకవర్గంలో సొంత నివాసం ఏర్పాటు చేసుకోనున్నారు. దీనికి సంబంధించిన భూమి పూజా కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. బాలయ్య, వసుంధర దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

గతేడాది డిసెంబర్‌లో అఖండ 2: తాండవం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు బాలయ్య. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన ‘ఎన్‌బీకే 111’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి గోపీచంద్‌ మలినేని దర్శకుడు. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు దీనిని నిర్మిస్తున్నారు.

Updated Date - Feb 20 , 2026 | 04:19 PM