NBK: కొరటాలతో బాలయ్య..ఎన్టీఆర్‌ కన్నా ముందేనా..?

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:46 PM

టాలీవుడ్ సీనియర్ హీరోల నుంచి నేటి తరం కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్న ఏకైక హీరో బాలయ్య. బాలయ్య నుంచి ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అవ్వాలనేది ఆయన టార్గెట్‌.

టాలీవుడ్ సీనియర్ హీరోల నుంచి నేటి తరం కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్న ఏకైక హీరో బాలయ్య (NBK). తన నుంచి ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అవ్వాలనేది ఆయన టార్గెట్‌. కానీ ప్రస్తుత సిట్యువేషన్స్‌ లో అది చాలా వరకు సాధ్యపడకపోయినా ఏడాదికి ఒక సినిమాతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. కేవలం సినిమాలు చేయడమే కాదు.. కుర్ర దర్శకులకు అవకాశం ఇస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకుమహారాజ్‌, అఖండ-2 వంటి విజయాల తర్వాత.. ఇప్పుడు కొరటాల శివ వంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడితో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం.

ప్రస్తుతం కొరటాల శివ (Koratala Shiva) ఫోకస్ అంతా 'దేవర' సీక్వెల్ పైనే ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయి 'దేవర-2' మొదలవ్వడానికి కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పట్టేలా ఉంది. ఈ ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా, కొరటాల ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. ఇప్పటికే ఈ కథను బాలయ్యకు వినిపించడం, దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయాయని సమాచారం. అయితే నందమూరి అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే.. దేవర 2 కంటే ముందే ఈ సినిమా ఉంటుందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఎన్టీఆర్ డేట్స్ దొరికే వరకు వేచి చూడకుండా, బాలయ్యతో ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కొరటాల భావిస్తున్నారు. ఇది టాలీవుడ్ వరకు పరిమితమవుతుందా లేక పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటుందా అనే క్లారిటీ రావాల్సి ఉంది. అయితే బాలయ్య క్రేజ్ ఇప్పుడు నేషనల్ లెవల్‌లో ఉంది కాబట్టి, ఇది భారీ లెవల్‌లోనే ఉండే అవకాశం ఉంది.

బాలయ్య లైనప్ చూస్తుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం. ఇప్పటికే గోపీచంద్ మలినేనితో ఒక సినిమా పట్టాలెక్కనుంది. అలాగే వివేక్ ఆత్రేయ, క్రిష్ వంటి దర్శకులతో సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ గ్యాప్‌లో కొరటాల శివ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది..? ఒకవేళ ఈ సినిమా గనుక మొదలైతే, కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే దేవర-2 మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది. బాలయ్య మార్క్ యాక్షన్.. కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ కలిసి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.  మరి ఎన్టీఆర్ కంటే ముందే కొరటాల బాలయ్య సినిమాను పూర్తి చేస్తారా..? ఈ సినిమా పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది..? అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. మన బాలయ్య ఊపు చూస్తుంటే ఏదైనా సాధ్యమే అనిపిస్తోంది.

Updated Date - Apr 18 , 2026 | 01:22 PM