Akkineni Nagarjuna: సంక్రాంతికి వస్తున్నాం.. పక్కా కొడుతున్నాం
ABN , Publish Date - May 24 , 2026 | 05:57 PM
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం కింగ్ 100 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. చాలా గ్యాప్ తరువాత నాగ్ 100 వ సినిమా చేస్తున్నారు. రా. కార్తిక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం కింగ్ 100 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. చాలా గ్యాప్ తరువాత నాగ్ 100 వ సినిమా చేస్తున్నారు. రా. కార్తిక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నాగ్ సరసన సీనియర్ బ్యూటీ టబు (Tabu), సుస్మిత భట్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటుంది.
ఇక తాజాగా కింగ్ 100 సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణంగా సంక్రాంతి సీజన్ వస్తే బాక్సాఫీస్ వద్ద నాగార్జున హవా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు, నా సామిరంగ చిత్రాలతో సంక్రాంతి కింగ్ అనిపించుకున్న నాగ్.. తన ప్రతిష్టాత్మక 100వ సినిమాను కూడా అదే సెంటిమెంట్‌తో బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అక్కినేని నాగార్జునకు సంక్రాంతి సీజన్ బాగా కలిసివచ్చిన సీజన్ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. పండుగ సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు భారీగా తరలివస్తుండటంతో, నాగ్ సినిమాలు అక్కడ సాలిడ్ వసూళ్లను అందుకుంటున్నాయి. అందుకే తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా 100వ సినిమాని తెరకెక్కిస్తుండడంతో.. దీనికి మించిన పర్ఫెక్ట్ టైమింగ్ ఉండదని నాగార్జున భావిస్తున్నారట. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్‌కు గట్టి టార్గెట్ పెట్టినట్లు టాక్. ఇక దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఈసారి సంక్రాంతికి వస్తున్నాం.. కొడుతున్నాం అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.