బిగ్ బాస్ నా వెంట్రుక కూడా పీకలేడు అన్న రోహిత్.. బయటికి పో అంటూ నాగార్జున ఫైర్
ABN , Publish Date - Oct 03 , 2026 | 09:42 PM
బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో గొడవలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. కంటెస్టెంట్స్ మీటిమీరి ప్రవర్తిస్తున్నారు.
బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ (Bigg Boss) తెలుగు సీజన్ 10 లో గొడవలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. కంటెస్టెంట్స్ మీటిమీరి ప్రవర్తిస్తున్నారు. ఇక ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా .. నాగార్జున వారందరికీ క్లాస్ ఎప్పుడు తీసుకుంటాడా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ వీకెండ్ లో నాగార్జున.. కంటెస్టెంట్స్ ని కడిగిపడేశాడు. వీకెండ్ ఎపిసోడ్‌కు సంబంధించిన తాజా ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. హోస్ట్ అక్కినేని నాగార్జున ఈసారి కంటెస్టెంట్లపై మునుపెన్నడూ లేనంత ఆవేశంగా, సంచలన రీతిలో విరుచుకుపడ్డాడు.
హౌస్‌లో గత వారం జరిగిన గొడవలు,కొట్లాటలను చూసి త్రిగుణ్, అమన్ లకు ఎల్లో కార్డ్ ఇచ్చాడు. ఈసారి కనుక గొడవపడినా.. బూతులు మాట్లాడినా హపూస లో నుంచి బయటకు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇక రోహిత్ కి ఏకంగా రెడ్ కార్డ్ ఇవ్వడం సంచలనంగా మారింది. బిగ్ బాస్ ప్రాధాన్యతను తక్కువ చేసి మాట్లాడిన అన్‌సీన్ వీడియోను నాగార్జున ప్రత్యక్షంగా ప్లే చేసి హౌస్‌మేట్స్ అందరి ముందూ రోహిత్ బండారాన్ని బయటపెట్టాడు. చరణ్ తో బిగ్ బాస్ నా వెంట్రుక కూడా పీకలేడు అని రోహిత్ చేసిన సైగలను వీడియోలో చూపించి అతనిపై ఫైర్ అయ్యాడు.
ఈ అన్‌సీన్ క్లిప్‌ను ప్రదర్శించిన అనంతరం నాగార్జున ఆడియెన్స్ వైపు తిరిగి, 'ఈ మాటలు బిగ్ బాస్ షోను హౌస్‌ను అవమానించేలా ఉన్నాయా లేదా?' అని ప్రశ్నించారు. అక్కడ ఉన్న ఆడియెన్స్ అందరూ ఏకగ్రీవంగా చేతులెత్తి ‘అవును’ అని మద్దతు తెలిపారు. ఆడియెన్స్ స్పందన చూసిన తర్వాత నాగార్జున తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. బిగ్ బాస్ వేదికను, ఈ షో అందించిన ప్లాట్‌ఫామ్‌ను గౌరవించలేని వారికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదని స్పష్టం చేశాడు.
ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో హోస్ట్ నాగార్జున సదరు కంటెస్టెంట్‌ను ఉద్దేశించి సీరియస్ లుక్‌తో ప్లీజ్ లీవ్ మై హౌస్ అని కరాఖండిగా ఆదేశించాడు. షో చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ ప్రోమో ముగింపు, ఈ వారం హౌస్ నుంచి ఎవరైనా రెడ్ కార్డ్ లేదా డైరెక్ట్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్తున్నారా అనే సస్పెన్స్‌ను పెంచేసింది. బిగ్ బాస్ రూల్స్ అతిక్రమించిన రోహిత్ ని.. నాగార్జున నిజంగానే వారిని ఎలిమినేట్ చేసి పంపించేశారా లేదా అనేది చూడాలి.