Geethanjali: మరోసారి వెండితెరపై.. 'గీతాంజలి' మ్యాజిక్! ఎప్పుడంటే

ABN , Publish Date - Oct 01 , 2026 | 03:22 PM

తెలుగు సినీ చరిత్రలోనే ఎవర్ గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన నాగార్జున గీతాంజలి చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది.

Geethanjali

తెలుగు సినీ చరిత్రలోనే ఎవర్ గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన నాగార్జున (Nagarjuna) గీతాంజలి (Geethanjali) చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. అగ్ర దర్శకుడు మణిరత్నం (Mani Ratnam)-ఇళయరాజా (Ilaiyaraaja) కాంబోలో వచ్చిన ఈ దృశ్య కావ్యాన్ని నవంబర్ 13న రీ-రిలీజ్ చేస్తున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) అధికారికంగా ప్రకటించింది.

గిరిజ (Girija) కథానాయికగా నటించిన ఈ చిత్రంలోని భావోద్వేగాలు, మధురమైన పాటలు ఇప్పటికీ సినీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న రీ-రిలీజ్ ట్రెండ్‌లో ఈ బ్లాక్‌బస్టర్ లవ్ మ్యాజిక్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Oct 01 , 2026 | 03:43 PM