Akkineni Nagarjuna: ఈ రోజును ఎప్పటికీ మరచిపోలేను..

ABN , Publish Date - May 23 , 2026 | 12:33 PM

అక్కినేని నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్‌’ విడుదలై 40 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో నాగార్జున భావోద్వేగ ట్వీట్‌ చేశారు.

Vikram Movie Cmpletes 40 Years


అక్కినేని నాగార్జున (Nagarjuna) తొలి చిత్రం ‘విక్రమ్‌’ (Vikram) విడుదలై 40 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో నాగార్జున భావోద్వేగ ట్వీట్‌ చేశారు. తన జీవితంలో ‘మే 23’ ఎంతో ప్రత్యేకమేనని తెలిపారు. ఈ ఏడాది మరింత ప్రత్యేకం కానుందని నాగ్‌ పేర్కొన్నారు. ఇన్నేళ్లగా అభిమానిస్తూ, ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.  



‘నా జీవితంలో మే 23.. ఎప్పటికీ మర్చిపోలేని రోజు.. మా నాన్న చివరి చిత్రం (మనం) 2014లో ఈ  తేదీనే రిలీజ్‌ అయింది. నాన్నతోపాటు నాగచైతన్య, అఖిల్‌తో నటించే అవకాశం ఆ సినిమాతో కుదిరింది. అలాగే 40 ఏళ్ల క్రితం ఇదే రోజు నా తొలి చిత్రం ‘విక్రమ్‌’ విడుదలైంది. మీ అందరినీ అలరించడానికి మీ ప్రేమాభిమానాన్ని పొందడం వచ్చాను. ఇంతకాలంగా నాకు సపోర్ట్‌గా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు.  భవిష్యత్తులు ఇలాంటి మే 23 తేదీని ఇలాగే సెలబ్రేట్‌ చేసుకోవాలి’ అని నాగార్జున్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.



విక్రమ్‌ చిత్రానికి  మధుసూధనరావు దర్శకుడు. 1986 మే 23న  ఈ సినిమా  విడుదలై చక్కని విజయాన్ని అందుకుని నాగ్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం  నాగార్జున 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు రా.కార్తీక్‌ ఈ చిత్రానికి దర్శకుడు.   

Updated Date - May 23 , 2026 | 12:56 PM