వింటేజ్‌ లుక్‌లో.. నాగార్జున

ABN , Publish Date - Mar 12 , 2026 | 06:35 AM

నాగార్జున ప్రస్తుతం తన వందో సినిమాలో నటిస్తున్నారు. ‘కింగ్‌ 100’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఆయన కెరీర్‌లోనే ల్యాండ్‌ మార్క్‌ చిత్రంగా తెరకెక్కుతోంది.

nagarjuna

నాగార్జున (Nagarjuna Akkineni) ప్రస్తుతం తన వందో సినిమాలో నటిస్తున్నారు. ‘కింగ్‌ 100’ (King 100) అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఆయన కెరీర్‌లోనే ల్యాండ్‌ మార్క్‌ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు ‘ఆకాశం’ ఫేమ్‌ రా కార్తీక్ (Ra Karthik). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌ గురించి ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

‘ఇందులో నాగ్‌ లుక్‌ చాలా స్టైలిష్‌గా ఉండనుంది. ఆయన ఈ సినిమాలో పలు విభిన్న రకాల గెట‌ప్స్‌లో కనిపించనున్నారు. ‘శివ’, ‘రక్షకుడు’ వంటి సినిమాల్లోని ఆయన వింటేజ్‌ లుక్స్‌ను ఈ చిత్రం గుర్తుకు తెస్తుంది. ఇందుకోసం ఆయన ఎంతో కసరత్తు చేస్తున్నారు’ అని చెప్పారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథాంశంతో నడిచే ఈ సినిమాలో ‘ఫ్యామిలీ మ్యాన్‌’ ఫేమ్‌ రవీంద్ర విజయ్‌ ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Mar 12 , 2026 | 11:22 AM