చైతన్యలో కొత్త మార్పు.. శోభితా వలనేనా

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:54 PM

అక్కినేని నాగచైతన్య (Akkineni NagaChaitanya)లో కొత్త మార్పు వచ్చిందా.. అంటే నిజమే అని అంటున్నారు అభిమానులు. ఇప్పటివరకు చై ఎక్కువ గుడులు, గోపురాలు అంటూ తిరిగింది లేదు.

Akkineni Naga Chaitanya

అక్కినేని నాగచైతన్య (Akkineni NagaChaitanya)లో కొత్త మార్పు వచ్చిందా.. అంటే నిజమే అని అంటున్నారు అభిమానులు. ఇప్పటివరకు చై ఎక్కువ గుడులు, గోపురాలు అంటూ తిరిగింది లేదు. ఎక్కువ అక్కినేని ఫ్యామిలీ.. ఆలయాల సందర్శలో కనిపించరు. అప్పుడెప్పుడో చై- శోభితా పెళ్ళి తరువాత అక్కినేని కుటుంబం స్వామివారి ఆలయంలో కనిపించారు. ఆ తరువాత ఇప్పటివరకు చై ఏ ఆలయంలో కనిపించలేదు. తాజాగా చై- శోభితా పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. పెళ్ళి తరువాత ఈ జంట జగన్నాథుడి ఆలయంలో పూజలు నిర్వహించారు. చివర్లో ఆయన జై జగన్నాథ్ అని మీడియాతో అనడం మరింత హైలైట్ గా మారింది.

సాంప్రదాయ దుస్తుల్లో చై - శోభితా ఎంతో అందంగా కనిపించారు. ఇక చై ఇలా ఆలయాలను సందర్శించడం అనేది చాలా కొత్తగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. సామ్ తో ఎప్పుడు చై ఇలా చేసింది లేదు. ప్రతిసారి సామ్ నే స్వామివారిని దర్శించుకొని వచ్చేవారు. ఇప్పుడు శోభితా వచ్చాకా ఆయన కూడా ఆలయాలను సందర్శించడంతో.. ఆమె చై ని మార్చేశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే గద్దర్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా నాగ చైతన్య ఎంపిక అయిన విషయం తెల్సిందే. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం చై వృషకర్మ సినిమాతో బిజీగా ఉన్నారు. విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నకార్తిక్ దండు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Mar 07 , 2026 | 05:48 PM