'నాగబంధం'.. రిలీజ్ ఎప్పుడంటే?

ABN , Publish Date - Mar 26 , 2026 | 04:08 PM

విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న నాగబంధం చిత్రం విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వివిధ భాషల్లో జూలై 3న విడుదల కానుంది.

Nagabandham Movie

'పెద కాపు'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యువ కథానాయకుడు విరాట్ కర్ణ నటిస్తున్న రెండో సినిమా 'నాగబంధం'. ఈ మూవీని స్వీయ దర్శకత్వంలో కిశోర్ అన్నపురెడ్డితో కలిసి అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్... ఈ సినిమా రేంజ్‌ను పెంచడమే కాదు... దానిపై అంచనాలు అంబరాన్ని తాకేలా చేసింది. విరాట్‌ కర్ణ ఈ సినిమాలో వైవిధ్యమైన పాత్రలో కనిపింబోతున్నాడు. పరమశివుడి గెటప్‌లోనూ, వైల్డ్ అవతార్‌లోనూ సిల్వర్ స్క్రీన్‌ ను షేక్ చేయబోతున్నాడని మేకర్స్ చెబుతున్నారు.


తాజాగా ఈ సినిమాను వివిధ భాషలలో జూలై 3న గ్రాండ్ గా రిలీజ్‌ చేస్తున్నట్టు అభిషేక్‌ నామా తెలిపారు. ఈ మూవీ కోసం వేసిన అనంత పద్మనాభ స్వామి సెట్‌ మూవీకి హైలైట్ గా నిలుస్తుందని అన్నారు. ఇంతవరకూ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చూడని విశేషాలను ఈ చిత్రంలో చూడొచ్చని, ఆధ్యాత్మిక శోభతో వెండితెర వెలిగిపోతుందని చెప్పారు.

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్‌ ఆచార్య పర్యవేక్షణలో ఐదు వేల మంది నృత్యకారులపై చిత్రీకరించిన పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని తెలిపారు. నభా నటేశ్‌, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, జయప్రకాశ్‌, మురళీ శర్మ, బి.ఎస్. అవినాశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - Mar 26 , 2026 | 05:06 PM