చిన్నారి వైద్యానికి నాగ‌బాబు ఆర్థిక సాయం

ABN , Publish Date - Feb 24 , 2026 | 08:18 AM

గుండె సంబంధ వ్యాధితో బాధ పడుతున్న మూడేళ్ల శ్రీహర్ష వైద్య ఖర్చుల నిమిత్తం సినీ నటుడు కొణిదెల నాగబాబు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు.

Nagababu

గుండె సంబంధ వ్యాధితో బాధ పడుతున్న ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామానికి చెందిన మూడేళ్ల కట్టా శ్రీహర్ష వైద్య ఖర్చుల నిమిత్తం ఏపీ శాసనమండలి సభ్యుడు, జనసేన పార్టీ (JanaSena Party) ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు కొణిదెల నాగబాబు (Naga Babu Konidela) లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని చిన్నారి తండ్రి రామకృష్ణకు సోమవారం హైదరాబాద్‌లో అందజేశారు.

Nagababu

'చిన్నసాయం చేసి.. పసి ప్రాణాన్ని కాపాడుదామా' అనే శీర్షికన సోమవారం ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. చిన్నారి స్వగ్రామమైన తాటిపూడి గ్రామానికి చెందిన పలువురు దాతలు సైతం రూ. 92వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే ఆంధ్రజ్యోతి కథనాన్ని చదివిన మరో ఇద్దరు దాతలు ఫోన్ పే ద్వారా రూ.20వేలను రామకృష్ణకు పంపారు.

Updated Date - Feb 24 , 2026 | 10:57 AM