Nagababu: చిట్టి చేతులు నుంచి జాతీయ అవార్డు వరకు.. నాగబాబు ఎమోషనల్!
ABN , Publish Date - Sep 22 , 2026 | 09:03 PM
తన కుమార్తె నిహారిక కొణిదెల సాధించిన ఘనతపై మెగా బ్రదర్ నాగబాబు చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
“36 సంవత్సరాల క్రితం తండ్రి ‘రుద్రవీణ’కు వెండి కమలం అందుకున్నారు. ఈ రోజు ఆ తండ్రి కుమార్తె ఉత్తమ ప్రాంతీయ చిత్రానికి వెండి కమలంతో ప్రకాశిస్తోంది. పురస్కారాలు వెండివి కావచ్చు.. కానీ వారసత్వం మాత్రం స్వచ్ఛమైన బంగారం లాంటిది' అని నాగబాబు కొణిదెల భావోద్వేగ పోస్ట్ చేశారు. తన కుమార్తె నిహారిక కొణిదెల సాధించిన ఘనతపై మెగా బ్రదర్ నాగబాబు చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు లభించిన నేపథ్యంలో నాగబాబు ఈ విధంగా స్పందించారు. నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకోవడంతో పాటు జాతీయ స్థాయిలోనూ పురస్కారాలు అందుకొంది. కుమార్తె సాధించిన ఈ విజయాన్ని నాగబాబు ఎంతో గర్వంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 36 ఏళ్ళ క్రితం నిర్మాతగా రుద్రవీణ చిత్రానికి నాగబాబు జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆ సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. “ఒకప్పుడు నా ఒడిలో ఆడుకున్న ఆ చిట్టి చేతులు.. అమాయకంగా నా వేళ్లను పట్టుకున్న ఆ చేతులు.. ఇప్పుడు భారత రాష్ట్రపతి సమక్షంలో అవార్డు రూపంలో గౌరవాన్ని అందుకొంది. అందుకుంటున్నాయి. నా కుమార్తె సాధించిన ఈ విజయం.. నా ఆత్మ సంబరంగా అనిపిస్తోంది' అని నాగబాబు పోస్ట్ పెట్టారు,