నాగశౌర్య.. బ్యాడ్‌బాయ్ కార్తిక్ ట్రైలర్! మొత్తం.. యాక్షన్‌తో నింపేశారుగా
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:41 PM
చాలా కాలం విరామం తర్వాత నాగశౌర్య (Naga Shaurya) నటించిన చిత్రం బ్యాడ్‌బాయ్ కార్తిక్.
చాలా కాలం విరామం తర్వాత నాగశౌర్య (Naga Shaurya) నటించిన చిత్రం బ్యాడ్‌బాయ్ కార్తిక్ (Bad Boy Karthik). రమేశ్ దేశిన (Ramesh) దర్శకుడిగా, విధి యాదవ్ (Vidhi Yadav) కథానాయికగా అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్17న థియేటర్లకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్‌ను చూస్తూ ఔట్ అండ్ ఔట్ రూరల్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా చిత్రాన్ని రూపొందించినట్లు అర్థమవుతోంది. సీనియర్ నరేశ్, సాయి కుమార్, వెన్నెల కిశోర్, సముతిరకని, శ్రీదేవి, పూర్ణ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. మూవీలో ఏదో మ్యాటర్ ఉందనేలా ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు.
ఎక్కువ శాతం యాక్షన్ సీన్లతో ట్రైలర్‌ను నింపేశారు. ఇదిలాఉంటే చాలా గ్యాప్ తర్వాత హరీశ్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. కానీ పాటలు అంతగా ఆదరణ నోచుకోలేదు. చాలాకాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్యకు ఈ సినిమా విజయం సాధించడం చాలా అవసరం.