నాగదుర్గకు డ్యాన్స్ రాదంట.. పిచ్చి ప్రియదర్శి

ABN , Publish Date - Nov 08 , 2026 | 02:56 PM

టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి (Priyadarshi), నాగదుర్గ (Naga Durga) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ఇడుపు కాయితం.

Idupu Kayitham

టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి (Priyadarshi), నాగదుర్గ (Naga Durga) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ఇడుపు కాయితం. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ పతాకాలపై సుకుమార్, బన్నీ వాస్, తబితా సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ రెడ్డి దొండపాటి (Vamsi Reddy Dondapati) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ , టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఊరమాస్ ఎనర్జీతో సాగే బారాత్ బీట్ డాన్స్ వీడియోను మేకర్స్ విడుదల చేసి ప్రేక్షకులకు దీపావళీ శుభాకాంక్షలు తెలిపారు.


విడుదలైన ఈ బారాత్ డాన్స్ వీడియోలో పెళ్లి బారాత్ జరుగుతుంది. ఇందులో శ్రీనివాస్ గా ప్రియదర్శి కనిపించగా.. శ్రీలతగా నాగదుర్గ కనిపించింది. ఇక పెళ్లి తరువాత కోడలిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు డ్యాన్స్ వేస్తూ ఆహ్వానిస్తారు. ఆ సమయంలోనే పెళ్లి కూతురు అయినా శ్రీలతని డ్యాన్స్ వేయమని అడగ్గా.. ఆమె నో అంటుంది. ఇక శ్రీనివాస్.. భార్యకు డ్యాన్స్ రాదేమో అనుకోని డ్యాన్స్ రాదనుకుంటా వదిలే అని చెప్పడంతో శ్రీలత.. తీన్‌మార్ డాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టేసింది. ఆమె మాస్ ఎనర్జీ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. తెలంగాణ జానపద స్టైల్, పెళ్లి బారాత్ వైబ్స్‌ను ప్రతిబింబించేలా ఈ పాటను డిజైన్ చేశారు. ప్రియదర్శి, నాగదుర్గల స్క్రీన్ ప్రెజెన్స్, గ్రామీణ నేపథ్యం ఈ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సురేష్ బొబ్బిలి అందించిన మాస్ బీట్స్ ఈ పాటను ఇన్‌స్టంట్‌గా చార్ట్‌బస్టర్‌గా మార్చేశాయి.


దర్శకుడు వంశీ రెడ్డి దొండపాటి ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి తెలంగాణ నేటివిటీతో, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు. వినోదంతో తెరకెక్కిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సమర్పణలో వస్తున్న సినిమా కావడంతో ఇడుపు కాయితం పై మొదటి నుంచి ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజ్ ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో అలరించే ప్రియదర్శి ఈ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు నాగదుర్గకు డ్యాన్స్ రాదని ఎలా అనుకున్నావ్ ప్రియదర్శి అని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రియదర్శి, నాగదుర్గ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Nov 08 , 2026 | 03:03 PM