నా కెరీర్‌లో.. బెస్ట్ మూవీ అవుతుంది!

ABN , Publish Date - Mar 06 , 2026 | 10:47 AM

వృషకర్మ నా కెరీర్‌లో వంద శాతం బెస్ట్ మూవీ అవుతుంది. చివరి ముప్ఫై నిమిషాల క్లైమాక్స్ భారతీయ సినీ పరిశ్రమకు బెంచ్ మార్క్‌ని సెట్ చేస్తుంది' అని అన్నారు నాగ చైతన్య .

Naga Chaitanya

"వృషకర్మ నా కెరీర్‌లో వంద శాతం బెస్ట్ మూవీ అవుతుంది. చివరి ముప్ఫై నిమిషాల క్లైమాక్స్ భారతీయ సినీ పరిశ్రమకు బెంచ్ మార్క్‌ని సెట్ చేస్తుంది' అని అన్నారు నాగ చైతన్య (Naga Chaitanya). ఆయన కథానాయకుడుగా కార్తీక్ దండు (Karthik Dandu) రూపొందిస్తున్న చిత్రమిది. మీనాక్షి చౌదరి కథానాయిక (Meenakshi Chaudhary) స్పర్డ్ శ్రీవాస్తవ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ (BVSN Prasad), సుకుమార్ బి. నిర్మిస్తున్నారు.

తాజాగా.. గురువారం నిర్వ హించిన కార్యక్రమంలో మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. గ్లింప్స్ ఒక భయానకమైన సన్నివేశంతో ప్రారంభమైంది. దుష్ట శక్తి ప్రభావంలో ఉన్న వ్యక్తి ఒక చిత్రాన్ని గీయడం, ఒక్కసారిగా అతని లోపలి నుంచి ఒక భయంకరమైన శక్తి గబ్బిలం రూపంలో బయటకు వచ్చి మరో వ్యక్తి తలలోంచి దూసు కెళ్లి అతన్ని చంపివేసే సన్నివేశం వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. 'అతీంద్రియ శక్తులు మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు, విధి ఒక వృషకర్మని ఎంచుకుంటుంది' అనే వాయిస్ ఓవర్ కథపై మరింత ఆసక్తిని పెంచింది.

ఈ కార్యక్రమంలో నాగ చైతన్య మాట్లాడుతూ 'ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఈ చిత్రంతో తీరింది' అని చెప్పారు. అంతేగాక తండేల్‌తో ఒక మెట్టు ఎక్కాను.. ఈ సినిమాతో బిగ్ సక్సెస్ కొట్టబోతున్నా అని అన్నారు. ఆపై రాజమౌళితో తన ల్యాండ్ మార్క్ సినిమా విష‌యంలొ వ‌స్తున్న‌ వార్త‌ల‌పై చైతూ క్లారిటీ ఇచ్చారు. అనంత‌రం దర్శకుడు కార్తిక్ దండు మాట్లాడుతూ నాగ చైతన్య గారికి ఆయన కెరీర్‌లో బెస్ట్ సినిమాని ఇవ్వబోతున్నాను. పాత్రలన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలో మీరు కొత్త నాగ చైతన్యని చూస్తారు' అని అన్నారు. కార్యక్ర మంలో స్ప‌ర్స్‌ శీవాత్స‌వ, మ్యూజిక్ డెరెక్టర్ అజినిష్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 10:47 AM