గోవా మోటార్ స్పోర్ట్స్.. ఈవెంట్‌లో చైతూ సందడి
ABN , Publish Date - Feb 23 , 2026 | 05:01 PM
అక్కినేని నాగ చైతన్యకు (Naga Chaitanya) రేసింగ్ అంటే విపరీతమైన ప్రేమ. ఆయనకు ప్రత్యేకంగా ‘హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్’ పేరుతో మోటార్‌స్పోర్ట్స్ జట్టు కూడా ఉంది.
అక్కినేని నాగ చైతన్యకు (Naga Chaitanya) రేసింగ్ అంటే విపరీతమైన ప్రేమ. ఆయనకు ప్రత్యేకంగా ‘హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్’ (Hyderabad Blackbirds) పేరుతో మోటార్‌స్పోర్ట్స్ జట్టు కూడా ఉంది. తాజాగా గోవాలో జరిగిన ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ రౌండ్ – 4లో ఆయన పాల్గొన్నారు. తన సొంత మోటార్ స్పోర్ట్స్ జట్టు ‘హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్’కు సపోర్ట్ గా గోవా స్ట్రీట్ సర్క్యూట్ లో చైతన్య సందడి చేశారు. ఫ్రాంచైజీ యజమానిగా నాగ చైతన్య, ట్రాక్‌పై హైస్పీడ్ యాక్షన్ మధ్య డ్రైవర్లను ఉత్సాహపరుస్తూ కనిపించారు.
రేసింగ్ అభిమానులు, స్పీడ్ ప్రేమికులతో కిటకిటలాడిన ఈవెంట్‌లో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉత్కంఠభరితమైన వీల్-టు-వీల్ పోరాటం మధ్య రేసింగ్ వాతావరణాన్ని ఆస్వాదించారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ రౌండ్–4కు భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు. నాగ చైతన్య హాజరు ఈ ఈవెంట్‌కు మరింత గ్లామర్‌ను తీసుకొచ్చింది. సినిమాలకే పరిమితం కాకుండా మోటార్ స్పోర్ట్స్ పట్ల తనకున్న ఆసక్తిని మరోసారి చూపించారు.