రావు బహదూర్ పై అక్కినేని హీరో ప్రశంసలు
ABN , Publish Date - Jul 05 , 2026 | 06:11 PM
వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్ (Satya Dev), టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా (Venkatesh Maha) కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం రావు బహదూర్ (Rao Bahadur).
వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్ (Satya Dev), టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా (Venkatesh Maha) కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం రావు బహదూర్ (Rao Bahadur). కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా, ఒక సరికొత్త, విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకుంటుంది. కొందరు ఈ సినిమా సూపర్.. ఇలాంటి చిత్రాలు తెలుగు ఇండస్ట్రీలోనే రాలేదు అంటే.. ఇంకొందరు అసలేమి ఆరడం కాలేదని చెప్పుకొస్తున్నారు. అయినా కూడా మంచి కలక్షన్స్ తో రావు బహదూర్ దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఊహించని స్థాయిలో మద్దతు లభిస్తోంది. తాజాగా అక్కినేని హీరో నాగ చైతన్య సినిమాను వీక్షించి.. చిత్రబృందాన్ని కలిసి మరీ ప్రశంసలు కురిపించాడు.
సినిమా చూసిన తర్వాత నాగచైతన్య మాట్లాడుతూ "నేను ఇటీవలి కాలంలో చూసిన అత్యంత ఒరిజినల్ అండ్ జెన్యూన్ సినిమాల్లో రావు బహదూర్ ఒకటి. ఎటువంటి కమర్షియల్ హంగులు, ఫార్ములాలు నమ్ముకోకుండా.. కేవలం కథను మాత్రమే నమ్మి ఇలాంటి సినిమా తీయడానికి చాలా గుండెధైర్యం కావాలి.. సత్యదేవ్, మొన్న సుకుమార్ అన్నట్లు ప్రతి ఆర్టిస్టు జెలసీ ఫీల్ అయ్యేలా చేశాడని చెప్పుకొచ్చాడు. సినిమాలో ప్రతీ క్యారెక్టర్ ఎంతో డీటెయిల్డ్‌గా, గుర్తుండిపోయేలా డిజైన్ చేశారని, చూసే ప్రతీ ప్రేక్షకుడికి ఈ సినిమా ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చైతూ తెలిపాడు.
అంతేకాకుండా, ప్రేక్షకులు బయట వినిపించే ఎలాంటి నెగెటివ్ అభిప్రాయాలను, రివ్యూలను పట్టించుకోకుండా.. థియేటర్లలో ఈ సినిమాను ఒక ఓపెన్ మైండ్‌తో చూడాలని నాగచైతన్య రిక్వెస్ట్ చేశాడు. ఇదొక బెంచ్‌మార్క్ సినిమా అని ప్రశంసిస్తూ, ఒక నటుడిగా ఈ సినిమా నన్ను ఎంతగానో ఇన్‌స్పైర్ చేసింది.. థాంక్యూ రావు బహదూర్ టీమ్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చై వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి చై రివ్యూతో రావు బహదూర్ మరింత వేగం పుంజుకొంటుందేమో చూడాలి.