The Raja Saab: నాచే నాచే సాంగ్.. అబ్బా అల్ట్రా స్టైలిష్ లుక్ ప్రభాస్ ఏమున్నాడ్రా బాబు
ABN , Publish Date - Jan 05 , 2026 | 09:56 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతీ (Maruthi) దర్శకత్వంలో తెరెక్కిన చిత్రం ది రాజా సాబ్(The Raja Saab).
The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతీ (Maruthi) దర్శకత్వంలో తెరెక్కిన చిత్రం ది రాజా సాబ్(The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ (Nidhi Agerwal), మాళవిక మోహనన్ (Malavika Mohanan), రిద్ది కుమార్ (Riddhi )నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నో వాయిదాలను దాటుకొని ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ సినిమా నుంచి ఒక వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.
నిజం చెప్పాలంటే ది రాజా సాబ్ ప్రమోషన్స్ అంత పీక్స్ లో ఏమి లేవు. కాకపోతే మొదటి నుంచి ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉండడం, ప్రభాస్ సినిమా కావడంతో సపరేట్ గా ప్రమోషన్స్ అక్కర్లేదు అని చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమా నుంచి నాచే నాచే అంటూ సాగే వీడియో సాంగ్ ను ఏంకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. కేవలం రెండు మూడు హిందీ లైన్స్ తో సాంగ్ మొత్తాన్ని నింపేశారు. అసలు హైలైట్ అంటే డార్లింగ్. ఇలాంటి స్టైలిష్ లుక్ లో ప్రభాస్ ని చూసి ఎన్నేళ్లు అయ్యిందో అని చెప్పొచ్చు.
ముగ్గురు భామలు ఈ మాత్రం అందాలను దాచుకోకుండా డిజైనర్ డ్రెస్ లలోఅదరగొట్టారు. బాహుబలిలో మనోహరి సాంగ్ తరువాత ముగ్గురు భామలతో డార్లింగ్ డ్యాన్స్ వేయడం ఈ సాంగ్ లోనే . థమన్ మ్యూజిక్ డీజే కన్నా ఎక్కువ కొట్టేశాడు. ఇక నుంచి ప్రతి పార్టీలో ఈ సాంగ్ ఉంటుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. డార్లింగ్ ని చూసినవారంఅందరూ అబ్బబ్బా.. ఏమున్నాడ్రా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి త రాజా సాబ్ తో ప్రభాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.