భిన్నమైన పాత్రలలో నభా నటేశ్...
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:24 PM
నభా నటేశ్ నటించిన 'స్వయంభు, నాగబంధం' చిత్రాలు ఈ యేడాది వేసవి కానుకగా విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల్లో భిన్నమైన పాత్రలను నభా నటేశ్ పోషించింది.
బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) కు ఈ సమ్మర్ ఎంతో స్పెషల్‌గా ఉండబోతోంది. ఆమె నటించిన రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు 'స్వయంభు' (Swayambhu, 'నాగబంధం' (Nagabandham) ఈ వేసవి విడుదలకు సిద్ధమవుతున్నాయి. భిన్నమైన కథా నేపథ్యాలతో తెరకెక్కిన ఈ రెండు చిత్రాల్లో నభా డిఫరెంట్ రోల్స్‌లో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. 'నాగబంధం' చిత్రంలో పార్వతి క్యారెక్టర్‌లో, 'స్వయంభు' చిత్రంలో సుందరవల్లి అనే యువరాణి పాత్రలో ఆమె నటిస్తోంది.
ఈ రెండు చిత్రాలతో ఆమె సాలిడ్ లైనప్ చేసుకుందని చెప్పుకోవచ్చు. 'స్వయంభు, నాగబంధం' చిత్రాల్లోని కంటెంట్ ఆడియెన్స్‌కు రీచ్ అయితే నభా నటేష్ హీరోయిన్‌గా మరో స్థాయికి వెళ్ళడం ఖాయం. ఈ రెండు చిత్రాల విజయాల పట్ల, తన క్యారెక్టర్స్‌కు రాబోయే రెస్పాన్స్ పట్ల నభా నటేష్ కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇప్పటికే 'స్వయంభు, నాగబంధం' చిత్రాల టీజర్స్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.
విశేషం ఏమంటే తెలుగులో నభా నటేశ్, నిధి అగర్వాల్ (Nidhi Agarwal) 'ఇస్మార్ట్ శంకర్' (Ismart Shankar) మూవీలో కలిసి నటించారు. వీరిద్దరికీ తెలుగులో అది మూడో చిత్రం. ఆ తర్వాత ఇద్దరూ పెద్ద విజయాలను అందుకోలేదు. అయితే... నిధి అగర్వాల్ నటించిన రెండు పాన్ ఇండియా మూవీస్ 'హరిహర వీరమల్లు, ది రాజా సాబ్' ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి. కానీ ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు అలానే నభా నటేశ్ నటించిన రెండు పాన్ ఇండియా సినిమాలు 'స్వయంభు, నాగబంధం' ఒక దాని వెనుక ఒకటి వస్తున్నాయి. మరి నభా నటేశ్ అయినా... ఈ సినిమాలతో విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి. ఇందులో స్వయంభు ఏప్రిల్ 10న విడుదల కానుంది.